మైత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివేకానంద జయంతి ఉత్సవాల్లో మెగా రక్తదాన శిబిరం
గుమ్మడిదల, జనవరి11 (ప్రజాస్వరం):
వివేకానంద జయంతి ఉత్సవాల్లో భాగంగా మైత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం గుమ్మడిదలలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో సేకరించిన రక్తాన్ని నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న థలసీమియా వ్యాధి పిల్లలు, గర్భిణీ స్త్రీల కోసం అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి జిల్లా అధ్యక్షురాలు గోదారి అంజి రెడ్డి, సినీ కళాకారిణి కరాటే కళ్యాణి, సీజీఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్మల గోవర్ధన్ రెడ్డి, జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షుడు సరెడ్డి బాలకృష్ణారెడ్డి, కాంగ్రెస్ నాయకుడు మూడుచింతల నరేందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో యువత పెద్దఎత్తున పాల్గొని సేవాస్ఫూర్తిని ప్రదర్శించారు. మొత్తం 37 మంది రక్తదానం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. స్వచ్ఛంద రక్తదానం ప్రాణాలను రక్షించగల మహత్తర సేవ అని పేర్కొన్నారు.


