మెదక్ సీఎస్ఐ చర్చ్ భక్తుల రద్దీ...
By Prajaswaram
On
మెదక్ జనవరి 11 (ప్రజాస్వరం):
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ సీఎస్ఐ చర్చ్ మహాదేవాలయంలో ఆదివారం ఘనంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ బీటర్ ఇంచార్జీ శాంతయ్య భక్తులకు దైవ సందేశాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో వచ్చిన క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన క్రైస్తవ భక్తులు, పర్యాటకులతో సందడిగా మారింది. ఈ తరుణంలో ముందుగా చర్చ్ ముందు భాగంగా లో గల సిలువ వద్ద కొబ్బరి కాయలు కొట్టి, కొవ్వొత్తులు వెలిగించి తమ మొక్కలను చెల్లించుకున్నారు. వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్చ్ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు.
Latest News
11 Jan 2026 19:50:04
అమీన్ పూర్, జనవరి11 (ప్రజాస్వరం): నూతనంగా జిహెచ్ఎంసి పరిధిలో విలీనమైన అమీన్పూర్ మండలంలోని కిష్టారెడ్డిపేటను ప్రత్యేక డివిజన్‌గా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్ష...


