క్షీరసాగర్ లో ఘనంగా ముగ్గుల పోటీలు

సంస్కృతి సంప్రదాయాలను చాటేలా వైవిధ్య రూపాల్లో ముగ్గులు వేసిన మహిళలు

క్షీరసాగర్ లో ఘనంగా ముగ్గుల పోటీలు

గజ్వెల్,ములుగు జనవరి 11 (ప్రజాస్వరం ):

 

క్షీరసార్ ముగ్గుల పోటీలు చూస్తే భీమవరంలో ఉన్నట్లుగా తలపిస్తున్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు.సంక్రాంతి సంప్రదాయాలు చాటేలా విభిన్న రూపాల్లో రంగు రంగుల ముగ్గులు వేశారు మహిళలు. మహిళలను ప్రోత్సహించి ఇంత గొప్ప పోటీలను నిర్వహించిన నిర్వహకుడు రాజును అభినందించారు గ్రామస్తులు. ములుగు మండలం క్షీరసాగర్ లో ఆదివారం సంక్రాంతి పండగ సంబరాలను పురస్కరించుకుని ముగ్గుల పోటీలను కేబుల్ టీవీ అశ్వినీ రాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ పోటీలకు గ్రామంలోని మహిళలు, యువతులు ఉత్సాహంగా పెద్ద ఎత్తున తరలివచ్చి వైవిధ్య రూపాల్లో ముగ్గులు వేశారు. దీంతో వీధులు ఈరోజే సంక్రాంతినీ పండుగను తలపించాయి. కాగా మన సంక్రాంతి,సంప్రదాయాలు చాటే విధంగా ముగ్గులు వేసిన యువతి నందినికి మొదటి బహుమతి దక్కింది,కాయితీ మానస,స్రవంతికి రెండో బహుమతి,గడ్డమీది లావణ్యకు మూడో బహుమతితో పాటు పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతిని అందజేశారు. మహిళలకు సంప్రదాయాలు గుర్తుకు వచ్చేలా, ఇంటి ముందు ముగ్గులను వేసుకునే వారిని ప్రోత్సహించేలా ఈ ముగ్గుల పోటీలు నిర్వహించడం సంతోషంగా ఉందని వారు పేర్కొన్నారు. సంక్రాంతి అంటేనే ముగ్గులు అని, మా గ్రామంలోని అక్క చెల్లెల కళ్లలో ఆనందం చూసేందుకే ఈ ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగిందని పోటీల నిర్వాహకుడు రాజు తెలిపారు. మన సంస్కృతి,సంప్రదాయాలు గుర్తు చేసేలా ముగ్గుల పోటీలకు తరలివచ్చిన వారందరికీ సంక్రాంతి పండగ శుభాకాంక్షలు తెలిపారు నిర్వాహకుడు రాజు.ఈ కార్యక్రమంలో నాయకులు కొన్యాల నరసింహా రెడ్డి,ఇర్కుల ఆనంద్ కుమార్,నల్ల శ్రీను,బొగ్గుల నరేందర్, బొగ్గుల అశోక్ మహేష్,బొగ్గుల నర్సింలు,బొగ్గుల రవి,పాండల రవి,బహిలంపూర్ రవి, కాయితీ అశోక్ మహిళలు,గ్రామస్తులు పాల్గొన్నారు..

Latest News

నూతన జిహెచ్ఎంసి డివిజన్ ఏర్పాటు చేయాలంటూ రిలే నిరాహార దీక్ష 2వ రోజు కొనసాగింపు నూతన జిహెచ్ఎంసి డివిజన్ ఏర్పాటు చేయాలంటూ రిలే నిరాహార దీక్ష 2వ రోజు కొనసాగింపు
అమీన్ పూర్, జనవరి11 (ప్రజాస్వరం):   నూతనంగా జిహెచ్ఎంసి పరిధిలో విలీనమైన అమీన్పూర్ మండలంలోని కిష్టారెడ్డిపేటను ప్రత్యేక డివిజన్‌గా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్ష...
పూర్వ విద్యార్థులు సర్పంచ్ కు సన్మానం 
కిష్టారెడ్డిపేటకు డివిజన్ ఏర్పాటు చేయకపోతే… ఛలో బల్దియా
మెదక్ సీఎస్ఐ చర్చ్ భక్తుల రద్దీ... 
మైత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివేకానంద జయంతి ఉత్సవాల్లో మెగా రక్తదాన శిబిరం
వివేకానంద స్వామి జయంతి కి పిలుపు.... 
క్షీరసాగర్ లో ఘనంగా ముగ్గుల పోటీలు