పూర్వ విద్యార్థులు సర్పంచ్ కు సన్మానం
తూప్రాన్ జనవరి 11( ప్రజాస్వరం ):
పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి
తూప్రాన్ మండలం మల్కాపూర్ సర్పంచ్ గా ఎన్నికైన పంజాల ఆంజనేయులు గౌడ్ పూర్వ విద్యార్థులు మాసాయిపేట మండల కేంద్రంలోని ఓ రిసార్ట్ లో 1992 -93 ఎస్. ఎస్. సి చదువుకున్న స్నేహితులు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సందర్భంగా తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామ సర్పంచిగా ఎన్నికైన పంజాల ఆంజనేయులు గౌడ్, మాసాయిపేట ఉప సర్పంచ్ గా ఎన్నికైన పసుల వెంకటేష్ ను సహచర మిత్రులు ఘనంగా సన్మానించారు. భవిష్యత్తులో రాజకీయంగా మరిన్ని ఉన్నత పదవులు పొందాలని స్నేహితులు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో స్నేహితులు మాసాయిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీకాంత్ నాగిరెడ్డి, మాజీ వార్డ్ మెంబర్ బండారు రాములు యాదవ్, R. ఆర్మీ నర్సింలు, సాయిబాబా గౌడ్, రవి గౌడ్, బాల మల్లయ్య, నాగిరెడ్డి, కే నర్సింలు, సంతోష్ సంతోష్ కుమార్ గుప్తా, మందుల నర్సింహులు పాల్గొన్నారు.


