ప్రమాదవశాత్తు రెండు నివాస పూరి గుడిసెలు దగ్ధం భారీగా నష్టం...

ప్రమాదవశాత్తు రెండు నివాస పూరి గుడిసెలు దగ్ధం భారీగా నష్టం...

 

చిన్న శంకరంపేట , డిసెంబర్ 30 ( ప్రజాస్వరం )        

Read More రోడ్డు ప్రమాదంలో విద్యార్ధిని మృతి

  చిన్న శంకరంపేట మండలంలోని వెంకట్రావుపల్లి గ్రామంలో రెండు నివాస పూరి గుడిసెలు అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. 
చింతకింది నర్సమ్మ ఇల్లు పూర్తిగా దగ్ధం కావడంతో లక్ష రూపాయల నగదు, 2 క్వింటాళ్ల బియ్యం, వస్త్రాలు, నిత్యావసర సరుకులు పూర్తిగా దగ్ధం కావడంతో ఆ కుటుంబం కట్టుబట్టలతో బయటపడింది. చింతకింది శంకర్ చెందిన నివాస కురిసే దగ్ధం కావడంతో రెండు లక్షల యాభై వేల రూపాయల నగదు, 5 తులాల బంగారం , 80 తులాల వెండితో పాటు వస్త్రాలు, నిత్యావసర సరుకులు పూర్తిగా కోల్పోయారు.ఈ ప్రమాదంలో సర్వం కోల్పోయిన ఈ రెండు కుటుంబాలను ప్రభుత్వం స్పందించి వెంటనే ఆదుకోవాలని మాజీ ఎంపిటిసి నాగరాజు కోరారు. మెదక్ రామయంపేట ఫైర్ సిబ్బంది అగ్నిమాపక వాహనాలతో మంటలను చల్లారిచారు

Read More తూప్రాన్ లో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు...