హరీశ్ రావును కలిసిన పృథ్వీరాజ్
పటాన్ చెరు ( ప్రజా స్వరం) :
హరీష్ రావును కలిసిన మాద్రి పృథ్వీరాజ్
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని పటాన్‌చెరు బీఆర్ఎస్ నాయకులు, MDR ఫౌండేషన్ కో–ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావును మర్యాదపూర్వకంగా కలుసుకుని నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ, పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు ఐక్యతతో ముందుకు సాగాలని, ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ వాటిని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
మాద్రి పృథ్వీరాజ్ మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీ ఆశయాలు, నాయకత్వాన్ని ప్రజలకు మరింత దగ్గర చేసేందుకు పటాన్‌చెరు నియోజకవర్గంలో సమిష్టిగా పనిచేస్తామని తెలిపారు. అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తూ, పార్టీ కోసం క్షేత్రస్థాయిలో కృషిని మరింత పెంచుతామని స్పష్టం చేశారు.
నూతన సంవత్సరం బీఆర్ఎస్ పార్టీకి మరింత బలాన్ని, ప్రజలకు మంచి భవిష్యత్తును అందించాలని ఆకాంక్షించారు.


