చరిత్ర సదస్సు లో ఆదిలాబాద్ జిల్లా ప్రదేశాల ప్రసంగం

చరిత్ర సదస్సు లో ఆదిలాబాద్ జిల్లా ప్రదేశాల ప్రసంగం

ఆదిలాబాద్ జిల్లా జనవరి 11 (ప్రజాస్వరం):

 

కొత్త తెలంగాణ చరిత్ర బృందం ఆధ్వర్యంలో హైదరాబాదులోని రవీంద్రభారతిలో నిర్వహించిన తెలంగాణ పునర్దర్శనం సదస్సులో అదిలాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాల గురించి వివిధ చరిత్రకారులు ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా 2023 లో అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కట్కo మురళి స్థానిక రిపోర్టర్ గంగాధర్ తో కలిసి పొచ్చేర వాటర్ ఫాల్స్ సమీపంలో ఆదిమానవుల పరికరాల సేకరణ సమయంలో జలపాతం క్రింద మరియు పైన ప్రాకృతిక శిల్పాలను గుర్తించారు. అదేవిధంగా గతంలో అదిలాబాద్ జిల్లాకు చెందిన డాక్టర్ ఏలియా గారు గుడిహత్నూర్ మండలంలోని రాంపూర్ సమీపంలో రామాలయం ప్రక్కన ఉన్న ప్రాకృతిక శిల్పాలను గుర్తించారు. ఈ రెండు ప్రాంతాలలోని ప్రాకృతిక శిల్పాలను జియో లాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ చకిలం వేణుగోపాల రావు గారు తన భారత దేశ ప్రాకృతిక శిల్పాలు అనే అంశంలో పొందుపరుస్తూ ప్రసంగించారు ఇవి ఆరు కోట్ల సంవత్సరాల క్రితం భూమి లోపట ఉన్న శిలా ద్రవం భూమి ఉపరితలానికి వచ్చి ప్రాకృతిక శిల్పాలుగా ఏర్పడినాయని పేర్కొన్నాడు ఇవి దేశంలో అరుదైన ప్రాకృతిక శిల్పాలు అని వీటిని పరిరక్షించి ఈ ప్రాంతాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని పేర్కొన్నాడు. అదిలాబాద్ జిల్లాలోని బజార్హత్నూర్ మండలంలో గిర్నూర్ గ్రామ సమీపంలో ఉన్న బోస్రా నది మెలికల్లో నిర్మించిన కనకాయి కోట గురించి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కటకం మురళి గారు ప్రసంగించారు. అతి ప్రాచీనమైన చరిత్ర కలిగిన ప్రదేశాలలో కనకాయి ఒకటి అని పేర్కొన్నాడు. ఈ ప్రాంతం గురించి అనేక మంది చరిత్రకారులు పరిశోధన చేసినారని, ఇది వ్యూహాత్మక జలదుర్గమని ఇటువంటి కోట ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడ లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇది శిథిలమైనప్పటికీ ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేయాలని కోరినాడు.

Latest News

నూతన జిహెచ్ఎంసి డివిజన్ ఏర్పాటు చేయాలంటూ రిలే నిరాహార దీక్ష 2వ రోజు కొనసాగింపు నూతన జిహెచ్ఎంసి డివిజన్ ఏర్పాటు చేయాలంటూ రిలే నిరాహార దీక్ష 2వ రోజు కొనసాగింపు
అమీన్ పూర్, జనవరి11 (ప్రజాస్వరం):   నూతనంగా జిహెచ్ఎంసి పరిధిలో విలీనమైన అమీన్పూర్ మండలంలోని కిష్టారెడ్డిపేటను ప్రత్యేక డివిజన్‌గా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్ష...
పూర్వ విద్యార్థులు సర్పంచ్ కు సన్మానం 
కిష్టారెడ్డిపేటకు డివిజన్ ఏర్పాటు చేయకపోతే… ఛలో బల్దియా
మెదక్ సీఎస్ఐ చర్చ్ భక్తుల రద్దీ... 
మైత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివేకానంద జయంతి ఉత్సవాల్లో మెగా రక్తదాన శిబిరం
వివేకానంద స్వామి జయంతి కి పిలుపు.... 
క్షీరసాగర్ లో ఘనంగా ముగ్గుల పోటీలు