రాయవరం యువతకు వాలీబాల్ కిట్ అందజేసిన
సర్పంచ్ రమేష్ గౌడ్
క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి..
గజ్వెల్, జనవరి 11 (ప్రజాస్వరం):
గ్రామాల్లోని యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి, క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని రాయవరం గ్రామ సర్పంచ్ రమేష్ గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం గ్రామంలోని క్రీడా మైదానంలో యువతకు ఆయన సొంత ఖర్చులతో ఎల్ఈడి లైట్స్ వాలీబాల్ కిట్‌ను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. క్రీడలు శారీరక ధృడత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని, గ్రామీణ యువత క్రీడల్లో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. గ్రామంలో క్రీడాకారులకు తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. సర్పంచ్ చేసిన ఈ ఆర్థిక సాయానికి గ్రామ యువత హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ , వార్డ్ మెంబర్లు, తాజా మాజీ సర్పంచ్, BRS ప్రెసిడెంట్ , BRS నాయకులు, గ్రామ పెద్దలు, యువకులు మరియు క్రీడా అభిమానులు పాల్గొన్నారు.


