ఘనంగా మైనంపల్లి జన్మదిన వేడుకలు...
చిన్న శంకరంపేట, జనవరి 10 ( ప్రజాస్వరం): జన్మించిన గ్రామంలోనే జన్మదిన వేడుకలు జరుపుకున్న మహానుభావుడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మెదక్ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరుస్తున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మాజీ ఎమ్మెల్యే మైనం పల్లి హనుమంతరావు జన్మదిన వేడుకలు ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు, మెదక్ జిల్లా సరిహద్దు ప్రాంతం నుండి ఆయనకు అభిమానులు కార్యకర్తలు భారీ కాన్వాయి తో ఘన స్వాగతం పలికారు, చిన్న శంకరంపేట మండలం గవలపల్లిలో నాయకులు అభిమానులు గజమాలతో స్వాగతం పలికారు, అనంతరం కొరివిపల్లి గ్రామంలోని దుర్గామాత ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు, జన్మదిన వేడుకలు అంబరాన్ని అంటే విధంగా సంబరాలు నిర్వహించారు, నియోజకవర్గంలో నుండే కాకుండా ఇతర నియోజకవర్గాల నుండి అభిమానులు వేల సంఖ్యలో తరలివచ్చి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు, వేదికపై సర్వమత ప్రార్థనలు నిర్వహించి ఆశీర్వాదాలు అందచేసే కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు నియోజకవర్గం నుండి కాకుండా ఇతర నియోజకవర్గాల నుండి పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు, మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్, స్థానిక కొరవి పల్లి సర్పంచ్ పుల్లారావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాజీ జెడ్పిటిసి పోతరాజు రమణ, సరాఫ్ యాదగిరి, మాజీ ఎంపీపీలు పండరి గౌడ్, అరుణ ప్రభాకర్, టి పి సి సి రాష్ట్ర నాయకుడు చౌదరి సుప్రభాత రావు రామాయంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, డిసిసి నాయకులు శ్రీమాన్ రెడ్డి, సానా సత్యనారాయణ, రాజిరెడ్డి,గజవాడ నాగరాజు, అమర్ సేనారెడ్డి, తోట లింగమూర్తి, చిరంజీవి, రాజశేఖర్ రెడ్డి, రాజాసింగ్, మహేందర్ సింగ్, రాజ్ కుమార్ గౌడ్, అవుసుల రవీందర్, అక్బర్, ఆకుల నవీన్ కుమార్, తోపాడు వివిధ గ్రామాల సర్పంచులు మాజీ ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు,


