కనకాయి కోట పై పత్ర సమర్పణ

కనకాయి కోట పై పత్ర సమర్పణ

ఆదిలాబాద్ జిల్లా జనవరి 11 (ప్రజాస్వరం):_

 

కొత్త తెలంగాణ చరిత్ర బృందం హైదరాబాదులోని రవీంద్రభారతిలో నిర్వహించిన చరిత్ర పునర్దర్శనo సదస్సులో ఇచ్చోడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల హిస్టరీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కట్కo మురళి ''కనకాయి కోట''పై పత్ర సమర్పణ చేసినాడు. కనకాయిలో క్రీస్తుపూర్వం పదవ శతాబ్దం నుంచి మానవుడు నివసించిన ఆనవాళ్లు ఉన్నాయని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కోటలపై PHd చేసి ఈ కోటపై సమాచారం ను సేకరించినట్లు వివరించాడు. మధ్యయుగంలో ఈ ప్రాంతంను బీర్షా షా అను గోండురాజు పరిపాలించినట్లు అతనికి అర్కాయి, గిరిజాయి, భూతాయి, కనకాయి అను నలుగురు కుమార్తెలు ఉండేవారని ప్రస్తుతం ఆ నలుగురు కుమార్తెల పేరు మీద నాలుగు గ్రామాలు ఉన్నట్లు, చిన్న కుమార్తె కనకాయిని రాణిగా చేసే ఆమె పేరు మీదనే కోటను నిర్మించినట్లు వివరించాడు. తన కోటను శత్రు దుర్భేద్యంగా ఉండే విధంగా అదిలాబాద్ జిల్లాలోని బజార్ హత్నూర్ మండలంలోని గిర్నూరు గ్రామానికి 1.5 కిలోమీటర్ల దూరంలో బోస్రా వాగు మెలికల్లో మూడు వైపుల సహజ సిద్ద నీరు ఉన్న ప్రదేశంలో కోటను నిర్మించి మరొకవైపు కూడా శత్రు దుర్వేద్యంగా ఉండేవిధంగా 6 ఎకరాల కొలను లేదా గుంతను త్రవ్వి ఆ గుంతలోకి బోస్రా వాగు నీరు వచ్చే విధంగా చేసి చుట్టూ జల రక్షణతో పటిష్టమైన భద్రతతో సాంకేతిక పరిజ్ఞానంతో ఆ కాలంలోనే అద్భుతమైన కోట నిర్మించినట్లు కటకo మురళి వివరించాడు. ఈ ప్రాంతాన్ని బీబీసీ న్యూస్ బృందం మరియు 2008లో కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులైన కల్వకుంట్ల కవిత మరియు శ్రీ రామోజీ హరగోపాల్, కుర్ర జితేంద్ర బాబు, జై కిసాన్ మొదలుకు చారిత్రకారులు సందర్శించినారని పేర్కొన్నాడు. ఈ చరిత్ర సదస్సులో పాల్గొన్న దక్కన్ ల్యాండ్ పత్రికా అధినేత మణికొండ వేద కుమార్ గారు మరియు ప్రొఫెసర్ జయధీర్ తిరుమల రావు గారు మరియు సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ గారు, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మాజీ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ చకిలం వేణుగోపాలరావు గారు డాక్టర్ కటకం మురళి గారిని అభినందించారు

Latest News

నూతన జిహెచ్ఎంసి డివిజన్ ఏర్పాటు చేయాలంటూ రిలే నిరాహార దీక్ష 2వ రోజు కొనసాగింపు నూతన జిహెచ్ఎంసి డివిజన్ ఏర్పాటు చేయాలంటూ రిలే నిరాహార దీక్ష 2వ రోజు కొనసాగింపు
అమీన్ పూర్, జనవరి11 (ప్రజాస్వరం):   నూతనంగా జిహెచ్ఎంసి పరిధిలో విలీనమైన అమీన్పూర్ మండలంలోని కిష్టారెడ్డిపేటను ప్రత్యేక డివిజన్‌గా ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్ష...
పూర్వ విద్యార్థులు సర్పంచ్ కు సన్మానం 
కిష్టారెడ్డిపేటకు డివిజన్ ఏర్పాటు చేయకపోతే… ఛలో బల్దియా
మెదక్ సీఎస్ఐ చర్చ్ భక్తుల రద్దీ... 
మైత్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వివేకానంద జయంతి ఉత్సవాల్లో మెగా రక్తదాన శిబిరం
వివేకానంద స్వామి జయంతి కి పిలుపు.... 
క్షీరసాగర్ లో ఘనంగా ముగ్గుల పోటీలు