బొల్లారం పోలీస్ స్టేషన్ రద్దుకు వ్యతిరేకంగా బిఆర్ఎస్ ధర్నా

బొల్లారం పోలీస్ స్టేషన్ రద్దుకు వ్యతిరేకంగా బిఆర్ఎస్ ధర్నా

బొల్లారం పోలీస్ స్టేషన్ రద్దుకు వ్యతిరేకంగా బిఆర్ఎస్ ధర్నా

 

బొల్లారం,జనవరి 02 ( ప్రజా స్వరం )

 

బొల్లారం జిహెచ్ఎంసి డివిజన్ 272 పరిధిలోని గాంధీ బొమ్మ సమీపంలో బొల్లారం పోలీస్ స్టేషన్‌ను రద్దు చేసి అమీన్‌పూర్ పోలీస్ సర్కిల్ పరిధిలో విలీనం చేయడాన్ని నిరసిస్తూ బిఆర్ఎస్ శ్రేణులు శుక్రవారం ధర్నా నిర్వహించారు. జిన్నారం జెడ్పిటిసి కొలన్ బాల్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.

40 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన బొల్లారం పోలీస్ స్టేషన్‌ను తొలగించడం అన్యాయమని బిఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బొల్లారం పరిధిలో సుమారు 25 కాలనీలు, 70 వేలకుపైగా జనాభా, 350 పరిశ్రమలు ఉన్నాయని, ఇటువంటి కీలక ప్రాంతాన్ని పోలీస్ స్టేషన్ లేకుండా చేయడం వల్ల ప్రజలకు భద్రత లేకుండా పోయిందని తెలిపారు.

ప్రస్తుతం పోలీస్ స్టేషన్‌కు సంబంధించిన ప్రతి విషయానికీ అమీన్‌పూర్‌కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని, దీని వల్ల స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. బొల్లారంలో 80 శాతానికి పైగా వలస కుటుంబాలు నివసిస్తుండగా, ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు కూడా ఎక్కువ సంఖ్యలో ఉండడం వల్ల పోలీసుల రక్షణ అత్యవసరమని పేర్కొన్నారు.

ప్రభుత్వం వెంటనే స్పందించి ఐడిఏ బొల్లారంలో పోలీస్ స్టేషన్‌ను పునరుద్ధరించాలని బిఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో జిన్నారం మాజీ ఎంపీపీ కొలన్ రవీందర్ రెడ్డి, బొల్లారం మాజీ కౌన్సిలర్లు వి.వేణుపాల్ రెడ్డి, టీ.సాయి కిరణ్ రెడ్డి, బీరప్ప యాదవ్, సతీష్, శ్రీకాంత్ యాదవ్, పార్టీ సీనియర్ నాయకులు బి.జైపాల్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ రత్నం, యాదగిరి, మాజీ ఎంపీటీసీలు, మాజీ వార్డు సభ్యులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Latest News

యువత చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి  యువత చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి
శివ్వంపేట, జనవరి 11 ( ప్రజా స్వరం ) :                            యువత చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని శభాష్ పల్లి సర్పంచ్ అయ్యగారి యాదగిరి అన్నారు. సంక్రాంతి సందర్భంగా...
చరిత్ర సదస్సు లో ఆదిలాబాద్ జిల్లా ప్రదేశాల ప్రసంగం
కనకాయి కోట పై పత్ర సమర్పణ
రాయవరం యువతకు వాలీబాల్ కిట్ అందజేసిన
ముఖ్యమంత్రి కలసిన మాజీ ఎమ్మెల్యే....
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ ఇస్తే గెల్చివస్తా....
ఘనంగా మైనంపల్లి జన్మదిన వేడుకలు...