జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన ప్రభాకర్ గౌడ్‌ కు జిల్లా ఎస్పీ సన్మానం....

జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన ప్రభాకర్ గౌడ్‌ కు జిల్లా ఎస్పీ సన్మానం....

రాష్ట్ర స్థాయి మాస్టర్ అథ్లెటిక్స్‌ లో ద్వితీయ స్థానం....

మెదక్ డిసెంబర్ 31 (ప్రజా స్వరం)

కరీంనగర్‌ లో నిర్వహించిన 12 వ రాష్ట్ర స్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో మెదక్ జిల్లా పోలీస్ విభాగానికి చెందిన ప్రభాకర్ గౌడ్ ద్వితీయ స్థానం సాధించి, జైపూర్‌ లో జరగనున్న జాతీయ స్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక కావడం గర్వకారణమని జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు అన్నారు. ఈ సందర్భంగా ప్రభాకర్ గౌడ్‌ ను మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో శాలువాతో సన్మానించి మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ విధి నిర్వహణలో నిబద్ధతతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ చాటడం అభినందనీయమని పేర్కొన్నారు. పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తూ క్రమశిక్షణ, కఠిన సాధనతో రాష్ట్ర స్థాయి పోటీల్లో మెరుగైన ఫలితాలు సాధించడం ఇతర సిబ్బందికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. పోలీస్ విధుల బాధ్యతలతో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ క్రీడల్లో ముందుకు సాగడం వల్ల మానసిక, శారీరక దృఢత్వం పెరుగుతుందని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో సాధించిన ఈ విజయం జాతీయ స్థాయిలో మరింత ప్రతిభ కనబర్చేందుకు దోహదపడుతుందని ఎస్పీ ఆశాభావం వ్యక్తం చేశారు. జైపూర్‌లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో మెదక్ జిల్లా పోలీస్ విభాగానికి మంచి పేరు తీసుకురావాలని ప్రభాకర్ గౌడ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా అదనపు ఎస్పీ మహేందర్, డీఎస్పీ రంగా నాయక్, ఆర్‌ఐ శైలందర్, ఎస్‌బీ సీఐ సందీప్ రెడ్డి, అథ్లెటిక్స్ కోచ్ మధుసూధన్, తదితర అధికారులు, సిబ్బంది పాల్గొని ప్రభాకర్ గౌడ్‌కు అభినందనలు తెలిపారు.

Latest News

కనకాయి కోట పై పత్ర సమర్పణ కనకాయి కోట పై పత్ర సమర్పణ
ఆదిలాబాద్ జిల్లా జనవరి 11 (ప్రజాస్వరం):_   కొత్త తెలంగాణ చరిత్ర బృందం హైదరాబాదులోని రవీంద్రభారతిలో నిర్వహించిన చరిత్ర పునర్దర్శనo సదస్సులో ఇచ్చోడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల హిస్టరీ...
రాయవరం యువతకు వాలీబాల్ కిట్ అందజేసిన
ముఖ్యమంత్రి కలసిన మాజీ ఎమ్మెల్యే....
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ ఇస్తే గెల్చివస్తా....
ఘనంగా మైనంపల్లి జన్మదిన వేడుకలు...
శిశు మందిర్ పాఠశాలలు నిరంతర శిక్షణా కేంద్రాలు
ప్రీమియర్ లీగ్ సీజన్ 3 క్రికెట్ పోటీలను ప్రారంభించిన