శిశు మందిర్ పాఠశాలలు నిరంతర శిక్షణా కేంద్రాలు
ఆదిలాబాద్ జిల్లా జనవరి 10 (ప్రజాస్వరం):
పూర్వ ప్రాధానాచార్యులు ఒరగంటి ఇస్తారి శిశు మందిర్ పాఠశాలలు నిరంతర శిక్షణా కేంద్రాలుగా ఉండి నైపుణ్యాలు గల ఉపాధ్యాయులను తయారు చేస్తూ అత్యుత్తమ ప్రతిభ గల విద్యార్థులను దేశానికి అందించుటలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయని ఓరగంటి ఇస్తారి గారు అన్నారు. ఇచ్చోడ మండల కేంద్రము లోని స్థానిక శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాలలో ఇచ్చోడ,బజార్ హత్నూర్, నేరేడిగొండ, గుడిహత్నుర్,బోథ్ శిశు మందిర్ పాఠశాలల ఆచార్యులకు నిరంతర శిక్షణ వర్గలలో భాగంగా మాసవ ర్గ నిర్వహించారు. పాఠశాల అధ్యక్షులు ప్రభుత్వ ఉపాధ్యాయులు దేవర్ల సంతోష్ కమ్యూనికేషన్ ఇంగ్లీష్ లో మెళకువలు గురించి క్లాస్ తీసుకున్నారు.వివిధ విషయాలు ఇంగ్లీష్,సైన్స్,తెలుగు,సదాచారం,శారీరక శిక్షణ లో ఎలా బోధించాలో విషయ నిపుణులు తరగతులు నిర్వహించారు.ఈ మాసవర్గ లో ప్రైమరీ,ప్రీ ప్రైమరీ తరగతుల ఆచార్యులకు శిక్షణ ఇవ్వడం జరిగింది.పాఠశాల కమిటీ సభ్యులు రాజేందర్, సుదర్శన్,సంతోష్,శేఖర్ ప్రధానాచార్యులు సంతోష్ కుమార్,వెంకట రమణ,మీన,రమాదేవి వివిధ పాఠశాల ల నుండి సుమారు 45 మంది ఆచార్యులు పాల్గొన్నారు.


