ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా గణేష్ గడ్డ శ్రీ సిద్ధి వినాయకుడిని దర్శించిన : ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
By Prajaswaram
On
పటాన్ చెరు, జనవరి 01 (ప్రజా స్వరం)
ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని పటాన్‌చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రుద్రారంలో ఉన్న గణేష్ గడ్డ శ్రీ సిద్ధి వినాయక స్వామి దేవాలయాన్ని పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయ అర్చకులు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికి వేద ఆశీర్వచనం అందించారు.
ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుడిని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రజల సహకారంతో పటాన్‌చెరు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు.
అనంతరం దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన కాలమానిని ఆవిష్కరించారు.
Latest News
11 Jan 2026 14:39:33
శివ్వంపేట, జనవరి 11 ( ప్రజా స్వరం ) : యువత చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని శభాష్ పల్లి సర్పంచ్ అయ్యగారి యాదగిరి అన్నారు. సంక్రాంతి సందర్భంగా...


