ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు కాని రైతులు త్వరగా నమోదు చేసుకోవాలి

వసంతరావు

ఫార్మర్ రిజిస్ట్రీ నమోదు కాని రైతులు త్వరగా నమోదు చేసుకోవాలి

జగదేవ్ పూర్, జనవరి10 (ప్రజాస్వరం) :

 

జగదేవ్ పూర్ మండలం తిమ్మాపూర్ మరియు వట్టిపల్లి గ్రామాలలో రైతులకు ఫార్మర్ రిజిస్ట్రీ నమోదును మండల వ్యవసాయ అధికారి యు. వసంతరావు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలం లోని రైతులు అందరూ ఈ ఫార్మర్ రిజిస్ట్రీ లో నమోదు చేసుకోవాలని సూచించారు. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలు చేస్తున్న పథకాలు పొందడానికి ఈ రిజిస్ట్రీ నెంబర్ తప్పని సరి అవుతుందని తెలిపారు. ఇప్పటివరకు నమోదు చేసుకొని రైతులకు వారి చరవాణి కి మేసేజ్ పంపించటం జరిగిందని కావున మండలంలో ఇప్పటివరకు నమోదు కానీ రైతులు అందరూ తమ సంభందిత వ్యవసాయ విస్తరణ అధికారి దగ్గర కానీ లేదా సమీప మీ సేవ సెంటర్ (రూ .15/ చెల్లించి) కు వెళ్లి నమోదు చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ సర్పంచ్ పోసానిపల్లి రాజు గ

 ఉప సర్పంచ్ అక్కరాజు నాగరాజు, మాజీ సర్పంచ్ తలకొక్కల శ్రీశైలం ,వట్టిపల్లి మాజీ సర్పంచ్ రజిత రాజేందర్ రెడ్డి,

రైతులు అక్కరాజు రాజయ్య, వడ్లకొండ మహేష్, కొంతం కృష్ణంరాజు, వీరబత్తిని రామకృష్ణ, పెద్దులు వ్యవసాయ విస్తరణ అధికారులు కిరణ్ మరియు కృష్ణమూర్తి పాల్గొన్నారు.

Latest News

యువత చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి  యువత చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి
శివ్వంపేట, జనవరి 11 ( ప్రజా స్వరం ) :                            యువత చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని శభాష్ పల్లి సర్పంచ్ అయ్యగారి యాదగిరి అన్నారు. సంక్రాంతి సందర్భంగా...
చరిత్ర సదస్సు లో ఆదిలాబాద్ జిల్లా ప్రదేశాల ప్రసంగం
కనకాయి కోట పై పత్ర సమర్పణ
రాయవరం యువతకు వాలీబాల్ కిట్ అందజేసిన
ముఖ్యమంత్రి కలసిన మాజీ ఎమ్మెల్యే....
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ ఇస్తే గెల్చివస్తా....
ఘనంగా మైనంపల్లి జన్మదిన వేడుకలు...