పేకాట రాయుల అరెస్ట్ నగదు మొబైల్ ఫోన్లు స్వాధీనం...
చిన్న శంకరంపేట జనవరి 24 ( ప్రజాస్వరం ) : చిన్న శంకరంపేట మండలం ఖాజాపూర్ అడవి ప్రాంతంలో పేకాట స్థావరంపై పాస్పోర్ట్ పోలీసులు దాడులు చేశారు, పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 8725 నగదు 4 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు, ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పేకాట బెట్టింగ్ వల్ల కుటుంబాలు నష్టపోతున్నాయని యువత తప్పుదారులు ఎంచుకుంటున్నారని దీని ద్వారా ఆ కుటుంబం మొత్తం అప్పులపాలై రోడ్డున పడుతున్నాయని ఆయన తెలిపారు, నమ్మదగిన సమాచారం మేరకు ఖాజాపూర్ అటవీ ప్రాంతంలో పేకాట ఆడుతున్నారని సమాచారం రావడంతో దాడులు నిర్వహించి నలుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుండి నాలుగు మొబైల్ ఫోన్లతో పాటు నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు, ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఆయన ప్రజలకు సూచించారు, మెదక్ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ బృందం దాడులు నిర్వహించడం జరిగిందని పేకాట రాయులతో పాటు వారి వద్ద నుండి నగదు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని చిన్న శంకరంపేట పోలీస్ స్టేషన్లో అప్పగించినట్లు తెలిపారు. పేకాట ఆడిన వారు నార్సింగ్ మండలం సంకాపూర్ తాండకు చెందిన వారిగా గుర్తించారు వారిలో శంకర్ నాయక్, ప్రకాష్, నేనావత్ అనిల్, బద్రు, ఉన్నట్లు తెలిపారు,


