బీజేపీ కాంగ్రెస్ నాయకులు టిఆర్ఎస్ లో చేరిక...

బీజేపీ కాంగ్రెస్ నాయకులు టిఆర్ఎస్ లో చేరిక...

 తూప్రాన్ జనవరి 24( ప్రజాస్వరం):

 పూర్ణ రాజు గౌడ్ ప్రతినిధి

మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం లోని తూప్రాన్ మున్సిపాలిటీ పదో వార్డు బ్రహ్మణ పల్లి 8 వార్డు పోతరాజు పల్లి చెందిన బిజెపి కాంగ్రెస్ నాయకులు యువకులు మహిళలు పెద్ద ఎత్తున తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి సంక్షేమానికి ఆకర్షితులై గజ్వేల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది 

వారికి గులాబీ కండువా వేసి బిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు

ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి వివేక్ వెంకటస్వామి తూప్రాన్ పర్యటనకు వచ్చినప్పుడు తూప్రాన్ పట్టణం ఏమీ అభివృద్ధి జరగలేదని అబద్ధాలు చెప్పడం హాస్యాస్పదమన్నారు ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు 

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తూప్రాన్ పట్టణానికి చేసిన అభివృద్ధి కాంగ్రెస్ మంత్రి వివేక్ వెంకటస్వామి కి కనిపించకపోతే కెసిఆర్ హయాంలో ప్రవేశపెట్టిన కంటి వెలుగు పథకంలో చికిత్స చేయించుకోండి కంటి వెలుగు అద్దాలు ధరించుకొని వస్తే తూప్రాన్ లో జరిగిన అభివృద్ధిని చూపిస్తామన్నారు 

కెసిఆర్ గారి హయాంలో తూప్రాన్ పట్టణాన్ని రెవిన్యూ డివిజన్ గా మార్చడం,

తూప్రాన్ పట్టణంలో 50 పడకల ఆసుపత్రి నిర్మాణం, డబుల్ బెడ్ రూంల నిర్మాణం, వెజ్ నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్, మున్సిపల్ భవనము, రోడ్డు డివైడర్ మధ్యలో సెంట్రల్ లైటింగ్ మీడియన్, ఆర్ అండ్ బి అతిథిగృహం, ప్రతి గల్లీకి సిసి రోడ్లు, పెద్ద చెరువు కట్టను మినీ ట్యాంక్ బండ్ గా మార్చడం, తూప్రాన్ పట్టణ ప్రకృతి వనం, మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి సురక్షితమైన స్వచ్ఛమైన త్రాగునీరు ఇవ్వడం, రైతు సంక్షేమం కోసం అధునాతమైన వ్యవసాయ మార్కెట్ యార్డ్ మరియు గోదాముల నిర్మాణం, సబ్ రిజిస్టర్ కార్యాలయ నిర్మాణం, తూప్రాన్ పట్టణంలోని జంక్షన్ల సుందరీకరణ, అధునాతన హంగులతో వైకుంఠధామ నిర్మాణం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అభివృద్ధి కార్యక్రమాలు దాదాపు 200 కోట్ల రూపాయలకు పైగా కేసీఆర్ తూప్రాన్ మున్సిపాలిటీ యొక్క రూపురేఖలను మార్చిన ఘనత కేసిఆర్ ది అని ఆయన అన్నారు అది తెలువక వివేక్ వెంకటస్వామి తమ గత చరిత్ర మరిచి అభివృద్ధి జరగలేదని చెప్పడం చాలా దారుణమని మండిపడ్డారు ఇప్పటికైనా అబద్ధాలు అసత్యాలు ప్రచారాలు చేయడం మానుకోవాలన్నారు లేదంటే తూప్రాన్ పర్యటనకు వచ్చినప్పుడు తూప్రాన్ పట్టణ ప్రజలతో అడ్డుకుంటామని మంత్రి వివేక్ వెంకటస్వామిని హెచ్చరించారు

కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో పూర్తిగా విఫలమైందన్నారు, కళ్యాణ లక్ష్మి తుల బంగారం, విద్యార్థులకు స్కూటీల పంపిణీ, మహిళలకు 2500 రూపాయలు, రైతుబంధు ఇవ్వడంలో, రైతు చేయకపోవడం, రెండు వేల పెన్షన్ 4000 ఇవ్వకపోవడం, రైతులకు సకాలంలో విత్తనాలు ఎరువులు సరఫరా చేయడంలో విఫలం, రైతులకు సాగునీరు అందించడంలో విఫలం, రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వడంలో ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ ప్రభుత్వం అన్నింటిలో వైఫల్యం చెందిందన్నారు

కాంగ్రెస్ ప్రభుత్వ 70 సంవత్సరాలు పరిపాలన కాలంలో అభివృద్ధి శూన్యం అన్నారు కాంగ్రెస్ హయాంలో అక్కా చెల్లెలు గుక్కెడు నీళ్ల కోసం కిలోమీటర్లు వెళ్లి బిందెలతో నీళ్లు మోస్తే భుజాలు కాయలు కాసేటివని గుర్తు చేశారు నేడు ఆ పరిస్థితి ఉందని ప్రశ్నించారు 

రైతులకు 24 గంటల కరెంటు లేక, ఎరువులు లేక విత్తనాలు లేక, గిట్టుబాటు ధరలు లేక గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆత్మహత్యలు జరిగేవని, నడవడానికి కూడా సరియైన రోడ్డు లేక ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం లో ఇబ్బంది పడ్డ రోజులు వివేక్ వెంకటస్వామి మరిచారని కాంగ్రెస్ పార్టీ అంటేనే అవినీతి అక్రమాలని కబ్జాలు అని అబద్ధాలు అసత్యాలు అని తెలిపారు ప్రజలు మీరు చెప్పే మాటలను ఎవరు నెంబర్ అన్నారు 

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండు సంవత్సరాల కాలంలో తూప్రాన్ లో మీరు చేసిన అభివృద్ధి ఏమిటని మీరు మంజూరు చేసిన నిధులు ఎన్ని అని మంత్రి వివేక్ వెంకటస్వామిని ప్రశ్నించారు 

గతంలోని కెసిఆర్ ప్రభుత్వం తూప్రాన్ పట్టణ అభివృద్ధికి 12 కోట్ల రూపాయలు మంజూరు చేసే మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 12 కోట్ల రూపాయలను రద్దుచేసి తూప్రాన్ మున్సిపాలిటీ అభివృద్ధిని అడ్డుకున్నది మీ కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు 

అంతేకాకుండా గడ్చిన రెండు సంవత్సరాల కాలంలో తూప్రాన్ పట్టణంలో అవినీతి నాయకులు టాక్స్ ల పేరిట టాక్స్ రుసుమును పెంచి గృహ నిర్మాణాలు చేసుకున్న వారి నుంచి వసూలు చేసి తూప్రాన్ మున్సిపాలిటీలో భారీ అవినీతి కార్యక్రమాలు చేశారని తెలిపారు రాబోయే రోజులలో వడ్డీతో కలిపి అన్ని వసూలు చేస్తామని కాంగ్రెస్ నాయకులను హెచ్చరించారు

కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో పూర్తిగా వైఫల్యం చెందిందని ఇందిరమ్మ చీరలు రెండు సంవత్సరాలలో ఎందుకు పంచలేదని కేవలం ఎన్నికలు వస్తే మాత్రమే రైతుబంధు ఇందిరమ్మ చీరలు, క్రిస్టియన్ గిఫ్ట్లు రంజాన్ తోఫాలు ఇలాంటివి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలక్షన్లు వస్తే మాత్రమే గుర్తుకు వస్తాయని ఎ ఎద్దవా చేశారు 

కానీ తూప్రాన్ పట్టణ ప్రజలు చాలా చైతన్యవంతులని మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ బిజెపి పార్టీలను ఓటు రూపంలో బొంద పెడతారని ఆయన హెచ్చరించారు కార్యక్రమంలో తూప్రాన్ మున్సిపాలిటీ ఎన్నికల ఇంచార్జ్ పరిశీలకుడు మచ్చ వేణుగోపాల్ రెడ్డి, మాజీ చైర్మన్ బొంది రవీందర్ గౌడ్, పట్టణ అధ్యక్షుడు సతీష్ చారి మాజీ ఎంపీపీ హరికృష్ణ, మండల పార్టీ అధ్యక్షుడు బాబుల్ రెడ్డి, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్, నాయకుల తదితరులు ఉన్నారు