చిన్నారులకు పలకలు పండ్లు పంపిణీ...
సర్పంచ్ కృష్ణ గౌడ్....
చిన్న శంకరంపేట జనవరి 23 ( ప్రజాస్వరం): చిన్న శంకరంపేట మండలం చందాపూర్ గ్రామంలో అంగన్వాడి కేంద్రంలో వసంత పంచమని పురస్కరించుకొని 22 మంది చిన్నారులకు పలకలు పండ్లను అందజేసి అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు, ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక సర్పంచ్ కృష్ణ గౌడ్ హాజరై విద్యార్థులకు పలకలు పండ్లను ఆయన సొంత డబ్బులతో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వసంత పంచమి సందర్భంగా విద్యార్థులకు పలకలను పండ్లను అందజేసినందుకు చాలా సంతోషంగా ఉందని విద్యార్థులు అమ్మవారి కృపా కటాక్షాలతో ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు, ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ చెన్నాగౌడ్ కృష్ణ గౌడ్, అంగన్వాడి టీచర్ స్వప్న, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పరమేశ్వర్ రెడ్డి, ఉపాధ్యాయురాలు తోటవ్వ తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు


