జిహెచ్ఎంసి శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్‌ను కలిసిన: కాట సుధాశ్రీనివాస్ గౌడ్

జిహెచ్ఎంసి శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్‌ను కలిసిన: కాట సుధాశ్రీనివాస్ గౌడ్

అమీన్ పూర్, జనవరి 09(ప్రజాస్వరం):

 

 జిహెచ్ఎంసి శేరిలింగంపల్లి జోన్ జోనల్ కమిషనర్‌ను సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధాశ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ నాయకులతో కలిసి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్‌ను శాలువాతో సన్మానించారు.

బీరంగూడ (270), అమీన్‌పూర్ (271) డివిజన్లలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. రోడ్ల అభివృద్ధి, డ్రైనేజ్ సమస్యలు, త్రాగునీటి సరఫరా, వర్షపు నీటి నిర్వహణ, చెరువుల అభివృద్ధి వంటి అంశాలపై చర్చ జరిగింది. సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాన్ని కమిషనర్‌కు అందజేశారు.ఈ కార్యక్రమం లో అమీన్ పూర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శశిధర్ రెడ్డి, సుధాకర్ యాదవ్,మన్నే రవీందర్, మున్నా, బిక్షపతి, గోపాల్ రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.