కిష్టారెడ్డిపేట్‌ను డివిజన్‌గా ఏర్పాటు చేయాలని

కాటా శ్రీనివాస్‌ గౌడ్‌కు అఖిలపక్ష విజ్ఞప్తి

కిష్టారెడ్డిపేట్‌ను డివిజన్‌గా ఏర్పాటు చేయాలని

అమీన్‌పూర్, జనవరి10 (ప్రజాస్వరం):

 

పటాన్‌చెరువు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కాటా శ్రీనివాస్‌ గౌడ్‌ను అమీన్‌పూర్ మండల అఖిలపక్ష నాయకులు కలిసి, కిష్టారెడ్డిపేట్‌ను డివిజన్‌గా ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు.

అఖిలపక్ష ప్రతినిధులతో సమావేశమైన కాటా శ్రీనివాస్‌ మాట్లాడుతూ, కిష్టారెడ్డిపేట్ డివిజన్ ఏర్పాటు విషయమై జిల్లా మంత్రివర్యులు దామోదర్ రాజనర్సింహతో మాట్లాడి ముందడుగు వేయించేలా పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అమీన్‌పూర్ మండల అఖిలపక్ష నాయకులు పాల్గొన్నారు.