అక్షర స్కూల్లో భోగి వేడుకలు ..
తూప్రాన్ జనవరి 10 (ప్రజాస్వరం) :
పూర్ణ రాజ్ గౌడ్ ప్రతినిధి
తూప్రాన్ పట్టణంలోని అక్షర పాఠశాలలో సంక్రాంతి సందర్భంగా విద్యార్థిని విద్యార్థులచే భోగి మంటలు నిర్వహించారు సంక్రాంతి వేడుకలకు ఆహ్వానం పలుకుతున్నట్లుగా ....
రంగుల రంగవల్లులు పలు రంగుల్లో మెరిసి పోతుండగా...హరిదాసులు,బుడబుక్కల వాళ్ళు,సాంప్రదాయ వస్త్రధారణలో విద్యార్థుల నృత్యాలు వెరసి అక్షర పాఠశాల ప్రాంగణం సంక్రాంతి సందళ్లతో అలరించింది. చిన్నారులకు భోగిపళ్లు పోసే కార్యక్రమంలో పాల్గొన్న చైర్ పర్సన్ ఉష రాంజనేయులు విద్యార్థులకు ఆశీర్వదించారు.గోదాదేవి,రంగన నిలిచింది.పండుగ సంస్కృతి సంప్రదాయాలను ఉపాధ్యాయురాలు రమాదేవి వివరించారు.
ఈ సందర్భంగా కరస్పాండెంట్ రామాంజనేయులు మాట్లాడుతూ..సంక్రాంతి పండుగ తెలుగు లోగిళ్లలో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.సంక్రాంతి పండగ శుభాకాంక్షలు తెలిపారు
ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


