ఆదర్శ గ్రామ అభివృద్ధికి సహకరించాలి 

జిల్లా కలెక్టర్ కు విన్నవించిన సర్పంచ్ ఆంజనేయులు గౌడ్.      

ఆదర్శ గ్రామ అభివృద్ధికి సహకరించాలి 

తూప్రాన్ డిసెంబర్31.(ప్రజాస్వరం) : 

తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామ అభివృద్ధికి సహకరించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ను పాలకవర్గ సభ్యులతో కలిసి సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ కలెక్టర్ కార్యాలయంలో విన్నవించారు. పంచాయతీ పాలకవర్గం గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందించాలని ఈ సందర్భంగా కలెక్టర్ నూతన పాలకవర్గానికి సూచించారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ నగేష్ గౌడ్, డిఆర్డిఓ శ్రీనివాసరావు, జెడ్పి సీఈఓ ఎల్లయ్య, డిపిఓ యాదయ్యలను మర్యాదపూర్వకంగా కలిశారు. 

Read More మేడ్చల్ అయ్యప్ప ఆలయంలో ఉత్తర ద్వారా దర్శనం 

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ పల్లెపాటి స్వామి, మాజీ సర్పంచ్ నవీన్ యాదవ్, వార్డు సభ్యులు సరిత పరమేష్ గౌడ్, జిన్న కృష్ణ, పిట్ల వేణు, రేఖ నాగరాజు గౌడ్, నాయకులు కొండల్ రెడ్డి లు పాల్గొన్నాఆరు.

Read More నూతన సంవత్సర వేడుకలు సురక్షితంగా జరుపుకోవాలి....