పాఠశాలలను సందర్శించిన తహసిల్దార్ గ్రేస్ బాయి
నార్సింగి, జనవరి 09 ( ప్రజాస్వరం ):
తహసీల్దార్ గ్రేస్ బాయి శుక్రవారం మండలం లోని పలు పాఠశాల లను సందర్శించి విద్యార్థులకు అవసరమైన ధృవ పత్రాల కోసం దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ గ్రేస్ బాయి మాట్లాడుతూ కలెక్టర్ రాహుల్ రాజ్, తూప్రాన్ ఆర్డీఓ జయచంద్రా రెడ్డి ఆదేశాల మేరకు నార్సింగి లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, భీం రావు పల్లి లోని ప్రాథమిక పాఠశాల ను సందర్శించి, ధృవ పత్రాల కోసం దరఖాస్తులను తీసుకోవడం జరిగిందని తెలిపారు. విద్యార్ధులకు అవసరమయ్యే ధృవీకరణ పత్రాల కోసం వారి విలువైన సమయం వృథా కాకుండా, చదువుల పై పూర్తి దృష్టి పెట్టాలన్న కలెక్టర్ రాహుల్ రాజ్ మంచి ఆలోచన అమలు లో భాగంగా విద్యార్థుల వద్దకు తామే స్వయంగా వెళ్ళి దరఖాస్తులను తీసుకున్నామని తెలిపారు. పాఠశాలల సందర్శన లో భీం రావు పల్లి పాఠశాల లో ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థుల కు పై చదువుల కోసం కావలసిన కుల, ఆదాయ, నివాస ధృవ పత్రాల కోసం దరఖాస్తులను, పాఠశాల లో విద్యను అభ్యసిస్తున్న కొందరు విద్యార్థుల జనన ధృవీకరణ పత్రాలలో మార్పులు చేయాల్సి ఉందని అక్కడి ఉపాధ్యాయులు తెలుపగా వారి వద్ద నుంచి కూడా దరఖాస్తులను స్వీకరించామని అన్నారు. నార్సింగి లోని ఉన్నత పాఠశాల లోని 10 వ తరగతి చదువుతున్న విద్యార్థుల నుంచి అవసరమున్న 30 వరకు కుల, ఆదాయ, నివాస ధృవ పత్రాల కోసం దరఖాస్తులను తీసుకున్నామని అన్నారు. ప్రభుత్వం తరపున విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం, ఇతర వసతుల ను పర్యవేక్షించామని అన్నారు. మధ్యాహ్న భోజన నాణ్యత, సౌకర్యాలు సంతృప్తికరంగా ఉన్నాయని అన్నారు. పదవ తరగతి విద్యార్థులకు బోర్డు పరీక్షల కోసం సన్నద్ధం కావాలని, ఇష్టంగా చదివి ఉన్నత ఫలితాలు సాధించాలని, ఉపాధ్యాయులు విద్యార్థులకు అవసరమైన సహకారం అందించాలని సూచించామని అన్నారు. పాఠశాలల సందర్శనలో ఆర్.ఐ శ్రీధర్, మేఘన, జీపీఓ వైష్ణవి పాల్గొన్నారు.


