గుమ్మడిదలలో క్రీడా పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ 

గుమ్మడిదలలో క్రీడా పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్ 

గుమ్మడిదల, జనవరి 10(ప్రజా స్వరం):

 

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదల మున్సిపల్ కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల ఆవరణలో సిజిఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఓపెన్ టు ఆల్ కబడ్డీ & వాలీబాల్ క్రీడా పోటీలను శనివారం ఉదయం లాంచనంగా ప్రారంభించిన పటాన్చెరు శాసన సభ్యులు శ్రీగూడెం మహిపాల్ రెడ్డి గారు. నేటి తరం విద్యార్థి, యువతలో క్రీడలపై ఆసక్తి పెంపొందించేలా క్రీడా కార్యక్రమాలు రూపొందించడం పట్ల నిర్వాహకులను అభినందించారు. క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం, శారీరక ధారుడ్యత, ఆత్మవిశ్వాసం లభిస్తుందని తెలిపారు. అనంతరం గ్రామంలో గల స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. 

 

హాజరైన గుమ్మడిదల మాజీ జెడ్పిటిసి కుమార్ గౌడ్, మాజీ ఎంపీపీ విజయభాస్కర్ రెడ్డి, సిజిఆర్ ట్రస్ట్ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సీఐ రమణారెడ్డి, షేక్ హుస్సేన్, మాజీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.