ఫార్మర్ రిజిస్ట్రేషన్‌పై రైతులకు అవగాహన

గుమ్మడిదల మండలంలో పరిశీలన

ఫార్మర్ రిజిస్ట్రేషన్‌పై రైతులకు అవగాహన

గుమ్మడిదల, జనవరి10 (ప్రజాస్వరం):

 

గుమ్మడిదల మండలంలో జరుగుతున్న ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని జిల్లా వ్యవసాయ అధికారి కే. శివప్రసాద్ ఈ రోజు పరిశీలించారు. వ్యవసాయ అధికారులు మరియు రైతులతో మాట్లాడుతూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ యొక్క ప్రాముఖ్యతను వివరించారు.

ప్రతీ రైతు కేంద్ర ప్రభుత్వం పథకాలు పొందాలంటే ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని తెలిపారు. ఇందుకోసం భూమి ఉన్న ప్రతీ రైతు తమ ఆధార్, లింక్ ఉన్న మొబైల్‌తో గ్రామంలోని ఏ ఈ ఓ లేదా మీసేవ కేంద్రాన్ని సంప్రదించి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని సూచించారు.

అలాగే ప్రతీ రోజు ఒక్కో గ్రామంలో రైతులకు రిజిస్ట్రేషన్ చేయాలని వ్యవసాయ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.

ఈ సందర్భంగా గుమ్మడిదల రైతు వేదిక మరియు నల్లవల్లి గ్రామాల్లో జరుగుతున్న ఫార్మర్ రిజిస్ట్రేషన్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో ఏ.ఓ. డీ. శ్రీనివాసరావు, ఏ.ఈ.ఓ. జీ. నిఖిత, ఆర్. ఆస్మిత మరియు రైతులు పాల్గొన్నారు.