ఆస్తి కోసం అత్తను చంపిన అల్లుడు...
మీడియా సమావేశంలో గజ్వేల్ ఏసిపి నర్సింలు
గజ్వేల్ / కొండపాక , జనవరి 09 (ప్రజాస్వరం ):
ఆస్తి కోసం సొంత అల్లుడే అత్తను చంపిన ఘటన కొండపాక మండలం తిమ్మారెడ్డి పల్లిలో చోటుచేసుకుంది.సిద్దిపేట జిల్లా కొండపాక మండలం తిమ్మారెడ్డి పలికి చెందిన రాములమ్మ రాజీవ్ రహదారి పక్కన హోటల్ నడుపుతూ జీవనం సాగిస్తుంది. రాములమ్మ తన కూతురుకి ములుగు మండలం తునికిబొల్లారం గ్రామానికి చెందిన జీవన్ రెడ్డితో వివాహం జరిపించిందని కుకునూర్ పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గజ్వేల్ ఏసిపి నర్సింలు తెలిపారు. రాములమ్మ పేరిట ఉన్న రెండెకరాల భూమి కోసం చిన్నల్లుడు జీవన్ రెడ్డితో తరచూ గొడవలు జరుగుతుండేవి కాగా తాను చనిపోయిన తర్వాత భూమిని తీసుకోండి అని రాములమ్మ అల్లుడితో తేల్చి చెప్పినట్లుగా తెలిసింది. అదేకాక కరోనా సమయంలో జీవన్ రెడ్డి ఉద్యోగం కోల్పోయి ఆర్థికంగా చికితిల పడ్డాడు. ఇక అత్త భూమినే నా సమస్యలు తీరుస్తుంది అని జీవన్ రెడ్డి భావించాడు. ఈ విషయాన్ని మనసులో పెట్టుకున్న అల్లుడు మొదట రాములమ్మ ఉంటున్న నివాసాన్నికి నింపు పెట్టాడు. అందులో నుండి రాములమ్మ రక్షింపండింది. అయితే ఎవరో లారీ డ్రైవర్లు తగులబెట్టారని అనుకునేలా చేశాడు జీవన్ రెడ్డి. ఇక అప్పుడు జీవన్ రెడ్డి మీద ఎవరికి అనుమానం రాలేదు. అయితే ఎలాగైనా చంపాలని తలిచిన నిందితుడు మంగళవారం రోజున పథకం ప్రకారం తనతో మరో ముగ్గురు వ్యక్తులతో కలిసి అత్తవారి ఇంటికి ముందు ద్వారం ద్వారా వెళ్ళాడు. అక్కడే చాయి త్రాగి ముందు డోర్ ను మూసివేసి రాములమ్మను టవల్ మెడకు బిగించి హత్య చేసి వెనుకాల డోర్ నుండి నిందితుడు జీవన్ రెడ్డి, తనతో వచ్చిన వ్యక్తులు పరారైనట్లుగా ఏసిపి తెలిపారు. అయితే నిందితుడు వెనకాల నుండి వెళ్ళిపోయిన విషయం సీసీ టీవీలో రికార్డ్ అయ్యింది. తనతో వచ్చిన వారి చెప్పులను ,హెల్మెట్ ను సైతం గుమ్మం ముందే వదిలి వెళ్ళాడని ఏసిపి నర్సింలు తెలిపారు.అయితే హత్యకు సహకరించిన వారితో పాటు మొత్తం ఎనిమిది మంది వ్యక్తులను అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తున్నట్లుగా ఏసిపి అన్నారు


