4 లేబర్ కొడ్స్ సవరణ బిల్లుల రద్దుకై పోరాటం: సి ఐ టి యు
తూప్రాన్ , జనవరి 10 (ప్రజాస్వరం) :
పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి
తూప్రాన్ బస్సు స్టాండ్ లో బిల్లులు సవరణ పై పోరు యాత్ర లో భాగంగా శనివారం రోజు
కేంద్ర ప్రభుత్వ విధానాలపై జనవరి 8 నుండి 11 వరకు జిల్లా వ్యాప్తంగా పోరు యాత్ర,
మెదక్ లో ఈనెల 8న ప్రారంభమైన కార్మిక కర్షక పోరుయాత్ర మనోహరబాద్ మండలం నుండి తూప్రాన్ పట్టణ కేంద్రానికి చేరుకోవడం జరిగింది.
జనవరి 19 న జిల్లా కేంద్రాల్లో సభలు ,,
సిఐటియు జిల్లా కోశాధికారి కే. నర్సమ్మ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్స్ రద్దు చేయాలి. విబి జీ రామ్ జీ చట్టం, జాతీయ విత్తన సవరణ బిల్లు, విద్యుత్ సవరణ బిల్లుల రద్దుకై దేశ వ్యాప్త పోరాటం చేస్తామని సీఐటీయూ జిల్లా కోశాధికారి కే. నర్సమ్మ తెలిపారు. సీఐటీయూ, తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ విధానాలపై జనవరి 8 నుండి 11 వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్మిక, కర్షక పోరుయాత్ర కొనసాగుతుందన్నారు.
ఈ సందర్బంగా తూప్రాన్ బస్ స్టాప్ సమీపంలో ఆమె మాట్లాడుతూ పెట్టుబడి దారుల కోసమే కేంద్ర ప్రభుత్వం సంస్కరణలను వేగంగా అమలు చేస్తుందన్నారు.2019లో తీసుకువచ్చిన లేబర్ కొడ్స్ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి చేస్తుందని తెలిపారు.శ్రమ శక్తి నీతి 2025 పేరుతో కార్మికుల ప్రయోజనాలను పెట్టుబడిదారులకు తాకట్టు పెడుతుందని విమర్శించారు.2025 పార్లమెంట్ సమావేశాల్లో విద్యుత్ ఉత్పత్తి రంగంలో ప్రయివేట్ సంస్థలకు అవకాశాలు కల్పిస్తు చట్టం చేయడం ఎంత వరకు సమంజసమని అన్నారు.బీమా రంగంలో 100 శాతం విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడం నిర్ణయం చేసిందని అన్నారు.న్యూక్లియర్ లాయబులిటి బిల్లు ద్వారా తీసుకువచ్చి ప్రజలపై భారలు వేస్తుందని అన్నారు గ్రామీణ ప్రాంతంలో ప్రజలకు జీవనోపాది కల్పిస్తున్న ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి కుట్రలు మొదలు పెట్టిందని తెలిపారు. ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన వీబీ జి రామ్ జి బిల్లు ఉపాధి కూలీల హక్కులను హరిస్తుంది. ఉపాధికి గ్యారంటీ లేకుండా చేస్తుందని ఆరోపించారు. పథకంలో ఉన్న మహాత్మా గాంధీ పేరును మార్చి జి రామ్ జి పేరుతో బిల్లు తేవడం ఎవ్వరి ప్రయోజనాలకోసమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలపై ఆర్థిక భారం మోపి పథకం అమలును రాష్ట్ర ప్రభుత్వాలపై నెట్టివేస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల దయదక్షిణ్యలపై ఆధారపడి ఉపాధి కూలీలు పని కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి ఏర్పడుతుందని పేర్కొన్నారు.గత 12 ఏండ్లుగా ఉపాధి హామీ పథకానికి నిధుల కోత విధిస్తుందని అన్నారు.కొత్త పథకం గ్రామీణ ప్రాంతంలో డిమాండ్ అదారిత హక్కుగా కాకుండా ప్రభుత్వం బడ్జెట్,నోటిఫికేషన్స్, టెక్నాలజీ లాంటి ఆంక్షలపై ఆధారపడుతుందని అన్నారు. ఇప్పటి వరకు గ్రామీణ ఉపాధి హామీ చట్టభద్ధమైన హక్కుగా ఉందని, కొత్త చట్టం వలన పరిపాలన నిర్వహణ అదారిత విధానంగా మారుతుందని తెలిపారు.దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతంలో ఉపాధి కూలీలకు సగటున కల్పిస్తున్న పని దినాలు 51.6 రోజుల కంటే ఎక్కువ లేవనే విషయం తెలియదా అని ప్రశ్నించారు. 100 రోజులు పని దినాలు పూర్తి చేసిన కుటుంబాలు 11 శాతనికి మించి లేవన్నారు.కొత్త చట్టం ప్రకారం ఉపాధి హామీ పథకం దేశవ్యాప్తంగా అమలు కాదని కేంద్ర ప్రభుత్వం నోటిఫైడ్ చేసిన ప్రాంతాలకే పరిమితం అవుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వలన గ్రామీణ ప్రాంతంలోని వికలాంగులు, ఒంటరి మహిళలు, వృద్ధులు, ఆదివాసులు, పెదప్రజలు నష్టపోతారని అన్నారు.కేంద్రం తెచ్చిన నూతన చట్టం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని తెలిపారు.నరేగా లో ఉన్నఉపాధి హామీ హక్కు అదారిత స్వభావన్నీ యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.
బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ సంస్థల్లో మతోన్మాద భావజాలన్నీ జోప్పిస్తుందని అన్నారు. రాజ్యాంగ బద్ద సంస్థలను తమ జేబు సంస్థలుగా మార్చుకుంటుందని అన్నారు.మతం ఆదారిత పరిపాలన చేయడం రాజ్యాంగ స్ఫూర్తి కి విరుద్దామని తెలిపారు. రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలపై దాడి చేస్తుందని అన్నారు. లౌకిక దేశాన్ని హిందుత్వ అదారిత దేశంగా మార్చి పరిపాలన చేయాలని కుట్రలు చేస్తుందని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేట్ పెట్టుబడి దారులకుకరు చౌకగా అమ్మివేస్తుందని అన్నారు. ప్రజల సంపదను ఆధాని, అంబాని లకు కట్టాబేడుతుందని అన్నారు. దేశ ప్రజల ప్రయోజనాల కంటే పెట్టుబడి దారుల ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇవ్వడం సిగ్గుచేటని అన్నారు.ప్రభుత్వసంస్థల్లోఅమలుఅవుతున్న రిజర్వేషన్స్ రద్దుచేయడానికికుట్రలుచేస్తుందనిఅన్నారు.కేంద్రo ప్రభుత్వసంస్థల్లో అమలు అవుతున్న సౌకర్యాలు తొలగించాడానికి కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుందని అన్నారు
*సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఏ మహేందర్ రెడ్డి మాట్లాడుతు*
మెదక్ జిల్లా వ్యాప్తంగా 21 మండలాలలో జాతను ప్రచారం చేసుకుంటూ తిరుగుతుందని అన్నారు. కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్మిక, రైతు, వ్యవసాయ కూలీ, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసించండి అని అన్నారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా జనవరి 8 నుండి 11 వరకు జీపు జాతాలు అన్ని మండలాలకు ప్రచారం చేసుకుంటూ వెళుతుందని అన్నారు. గత 11 సం॥రాలుగా కేంద్ర బిజెపి ప్రభుత్వం ప్రజల హక్కులను కాలారాయడమే కాక, రాష్ట్రాల హక్కులను హరిస్తూ చట్టాలను చేసింది. ఒక వైపున ప్రజాసంక్షేమం వల్లిస్తూనే 11సం॥రాల పాలనలో కార్పొరేట్ సంస్థలకు రూ.16 లక్షల కోట్లు రాయితీలు ఇచ్చింది. ప్రభుత్వ రంగ సంస్థలను అదానీ, అంబానీ వంటి బడాపెట్టుబడి దారులకు కట్టబెడుతున్నదన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై జనవరి 19 న జిల్లా కేంద్రంలో సభ నిర్వహిస్తున్నామని తెలిపారు.
వీటికి వ్యతిరేకంగా సిఐటియు, తెలంగాణ రైతు సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా జరిగే ఆందోళనల్లో కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, ప్రజలు, ప్రజాస్వామిక వాదులు భాగస్వాములు కావాలని కోరుతున్నామనీ అన్నారు.
*వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కే మల్లేశం మాట్లాడుతూ...* వామపక్షాల పోరాటం ఫలితంగా 2005లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి గ్యారెంటీ చట్టం రూపొందింది దీని ప్రకారం వ్యవసాయ కార్మికులకు సంవత్సరంలో 100 రోజులు పని కల్పించాలి ప్రస్తుతం రోజుకి 307 రూపాయలు ఇవ్వాలి కానీ దేశంలో మొత్తం వ్యాయంలో 90% కేంద్రం 10 శాతం రాష్ట్రాలు భరించాలి ఈ చట్టం ద్వారా కరువుల్లో కరోనా సందర్భంగా గ్రామీణ ప్రజలకు ఉపాధి దొరికింది. కానీ ఈ పథకాన్నికి ఏటా 2.5 లక్షల కోట్లు కేటాయించాలని ఆందోళన జరుగుతుండగా కేంద్ర బిజెపి ప్రభుత్వం ఈ చట్టాన్ని మార్చి ఎత్తివేయడానికి ప్రయత్నాలు చేస్తుందని అన్నారు. రక్షణ కోసం పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు
ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ, మున్సిపల్ ,విద్యుత్ ఇతర రంగాల నాయకులు బాబు,సురేష్,కృష్ణ,భాగమ్మ,పునమ్మ, స్వరూప, పోచమ్మ,శాంతమ్మ,ఎల్లo, స్వామి, దాశరథ,మలేష్,నాగరాజు. హనుమంత్, వెంకటేష్, సునీల్, శేఖర్, నరేoదర్, అసిఫ్,శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.


