తీన్మార్ మల్లన్న పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు

టిఆర్పి జిల్లా అధ్యక్షులు తుప్పతి బిక్షపతి కురుమ

తీన్మార్ మల్లన్న పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు

తీన్మార్ మల్లన్న వ్యక్తి కాదు బీసీ ఉద్యమ శక్తి

గజ్వెల్, జనవరి 09 (ప్రజాస్వరం):

 

తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపకులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పై జాగృతి అధ్యక్షురాలు కవిత అనుచరులు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలంగాణ రాజ్యాధికార పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు తుప్పతి బిక్షపతి కురుమ అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలో టిఆర్పి జిల్లా ఉపాధ్యక్షులు నర్సింగ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు తుప్పది శ్వేత లతో కలిసి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బహుజనులకు రాజ్యాధికారం ఏర్పాటు చేసే దిశగా తీర్మానం మల్లన్న ఉద్యమం చేస్తున్నాడని, అలాంటి వ్యక్తిపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అనుచరులు అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఎలాంటిదో ప్రజలందరికీ తెలుసని, కెసిఆర్ కవితను కుటుంబం నుంచి ఎందుకు వేలేశారో అందరికీ తెలుసని అన్నారు. తీన్మార్ మల్లన్న అంటే ఒక వ్యక్తి కాదని బిసి ఉద్యమ శక్తి అని, అగ్రవర్ణ రాజకీయాలకు చెక్ పెట్టి దిశగా మల్లన్న అడుగులు వేయడం అగ్రవర్ణ రాజకీయ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రాజ్యాధికారం రావాలని ఉద్దేశంతో తీన్మార్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని స్థాపించడం జరిగిందని, పార్టీలో వేలాది చేరికలు రాష్ట్ర నలుమూలల నుంచి ఉప్పొంగుతున్న బీసీ చైతన్యాన్ని ఇక ఎవరు ఆపలేరని, గ్రామ, మండల, జిల్లా స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. బహుజనులకు రాజకీయాల్లో నిజమైన ప్రాతినిధ్యం, అధికారంలో భాగస్వామ్యం కల్పించడమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ లక్ష్యం అని పేర్కొన్నారు. తీన్మార్ మల్లన్న పై ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని, మల్లన్న వెనుక ఈరోజు ఎస్సీ, ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ ఏకమై ఉన్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీదే అధికారంమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో యువజన విభాగ ఉపాధ్యక్షుడు మల్కి సంపత్ కుమార్, మైనార్టీ అధ్యక్షులు సయ్యద్ బాబా, పరశురాము తదితరులు పాల్గొన్నారు.