వాణిజ్య శాస్త్ర అధ్యాపకురాలికి డాక్టరేట్...

వాణిజ్య శాస్త్ర అధ్యాపకురాలికి డాక్టరేట్...

మెదక్, ఫిబ్రవరి 06 (ప్రజాస్వరం):

 

స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వాణిజ్య శాస్త్ర ఆధ్యాపకురాలిగా పనిచేస్తున్న పైడి హరిత డాక్టరేట్ పొందినట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కే హుస్సేన్ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ పరిశోధన రంగంలో కళాశాల అధ్యాపకులు ఈ విధంగా కృషి చేస్తున్నందుకు ప్రశంసించారు. పరిశోధనలు వ్యక్తిగతంగా కెరీర్ పరంగా అధ్యాపకులకు చాలా అవసరమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పైడి హరిత మాట్లాడుతూ రాజస్థాన్ లోని జగదీష్ ప్రసాద్ జబర్మల్ టిబ్రేవాలా విశ్వవిద్యాలయంలో డాక్టర్ ముఖేష్ కుమార్ పర్యవేక్షణలో ఏ స్టడీ ఆన్ కస్టమర్ సర్వీసెస్ అండ్ ట్రైనింగ్ విత్ సబ్జెక్టెడ్ టూ పాలసీ ఇంటరక్షన్స్ ఇన్ ఇండియన్ ఇ -కామర్స్ పోర్టల్స్ అనే అంశం పై పరిశోధన చేసినందుకు గాను డాక్టరేట్ పొందినట్లు తెలిపారు.

Latest News

వాణిజ్య శాస్త్ర అధ్యాపకురాలికి డాక్టరేట్... వాణిజ్య శాస్త్ర అధ్యాపకురాలికి డాక్టరేట్...
మెదక్, ఫిబ్రవరి 06 (ప్రజాస్వరం):   స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వాణిజ్య శాస్త్ర ఆధ్యాపకురాలిగా పనిచేస్తున్న పైడి హరిత డాక్టరేట్ పొందినట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కే...
13వ వార్డులో జానకిరామ్ గౌడ్ ఇంటింటా ప్రచారం.... 
తూప్రాన్ లో పోలీస్ ల ప్లాగ్ మార్చ్..... 
అక్రమ మద్యం రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్ట్...
షాపుల వద్ద సీసీ కెమెరాలు తప్పనిసరి....
104 లీటర్ల మద్యం స్వాధీనం, స్విఫ్ట్ కారు సీజ్...
14వ వార్డులో జనసేన అభ్యర్థి జంగం స్వాతి సుధాకర్ హోరాహోరీ ప్రచారం...