14వ వార్డులో జనసేన అభ్యర్థి జంగం స్వాతి సుధాకర్ హోరాహోరీ ప్రచారం...

పాల్గొన్న సినిమా నటులు (గబ్బర్ సింగ్ టీం)..

14వ వార్డులో జనసేన అభ్యర్థి జంగం స్వాతి సుధాకర్ హోరాహోరీ ప్రచారం...

గ్లాసు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విన్నపం

గజ్వేల్, 06 ఫిబ్రవరి (ప్రజాస్వరం):

సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ 14వ వార్డు జనసేన పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి జంగం స్వాతి సుధాకర్ గెలుపును కాంక్షిస్తూ శుక్రవారం వార్డులో విస్తృత స్థాయి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో సినిమా నటులు 'గబ్బర్ సింగ్ టీం' ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బృందం సభ్యులు అభ్యర్థితో కలిసి ఇంటింటికీ తిరుగుతూ, జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా గబ్బర్ సింగ్ టీం సభ్యులు మాట్లాడుతూ వార్డులోని ప్రతి వీధి, ప్రతి సమస్యపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి జంగం స్వాతి సుధాకర్ అని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం గజ్వేల్‌కు రావడం జరిగిందని వారు పేర్కొన్నారు. 24 గంటలు వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రతి సమస్యను తన సొంత సమస్యగా భావించి పరిష్కరించే తత్వం స్వాతి సుధాకర్ సొంతం అన్నారు. వార్డులో పెండింగ్‌లో ఉన్న సిసి రోడ్లు, విద్యుత్ సమస్యలు, తాగునీటి (నల్ల) సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ వృద్ధాప్య పింఛన్లు, రేషన్ కార్డులు అందేలా చొరవ చూపుతారని హామీ ఇచ్చారు. సామాన్యుడి గొంతు మున్సిపాలిటీలో వినిపించాలన్నా గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి జంగం స్వాతి సుధాకర్ ని భారీ మెజారిటీతో గెలిపించాలని వారు ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.

Related Posts

Latest News

వాణిజ్య శాస్త్ర అధ్యాపకురాలికి డాక్టరేట్... వాణిజ్య శాస్త్ర అధ్యాపకురాలికి డాక్టరేట్...
మెదక్, ఫిబ్రవరి 06 (ప్రజాస్వరం):   స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వాణిజ్య శాస్త్ర ఆధ్యాపకురాలిగా పనిచేస్తున్న పైడి హరిత డాక్టరేట్ పొందినట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కే...
13వ వార్డులో జానకిరామ్ గౌడ్ ఇంటింటా ప్రచారం.... 
తూప్రాన్ లో పోలీస్ ల ప్లాగ్ మార్చ్..... 
అక్రమ మద్యం రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్ట్...
షాపుల వద్ద సీసీ కెమెరాలు తప్పనిసరి....
104 లీటర్ల మద్యం స్వాధీనం, స్విఫ్ట్ కారు సీజ్...
14వ వార్డులో జనసేన అభ్యర్థి జంగం స్వాతి సుధాకర్ హోరాహోరీ ప్రచారం...