అక్రమ మద్యం రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్ట్...
576 క్వార్టర్స్ విస్కీ స్వాధీనం స్విఫ్ట్ కారు సీజ్
జిన్నారం, ఫిబ్రవరి 06(ప్రజాస్వరం):
బెల్ట్ షాపుల్లో మద్యం విక్రయించి అక్రమంగా లాభాలు పొందాలనే ఉద్దేశంతో మద్యం రవాణా చేస్తున్న వ్యక్తిని ఐడిఏ బొల్లారం పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆలేటి వేణుగోపాల్ రెడ్డి, వయస్సు 44 సంవత్సరాలు, నివాసం బొంతపల్లి గ్రామం, అనే వ్యక్తి ఈరోజు సాయంత్రం 6 గంటల సమయంలో తన స్విఫ్ట్ కారులో అక్రమంగా మద్యం తరలిస్తున్నట్లు నమ్మదగిన సమాచారం మేరకు పోలీసులు చెట్లపోతారం వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు.
తనిఖీలలో కారులో మొత్తం 576 క్వార్టర్స్ విస్కీ (103 లీటర్లు) లభ్యమయ్యాయి. వీటి విలువ సుమారు రూ.1,14,048/- గా గుర్తించారు. అక్రమ మద్యం రవాణాకు ఉపయోగించిన స్విఫ్ట్ కారును పోలీసులు సీజ్ చేసి, నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
ఎలాంటి అనుమతులు లేకుండా మద్యం విక్రయించినా, కలిగి ఉన్నా అట్టి వ్యక్తులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని ఐ డి ఏ బొల్లారం ఇన్స్పెక్టర్ మూల రవీందర్ రెడ్డి హెచ్చరించారు.


