104 లీటర్ల మద్యం స్వాధీనం, స్విఫ్ట్ కారు సీజ్...

బెల్ట్ షాపులో అక్రమ మద్యం విక్రయం ...

104 లీటర్ల మద్యం స్వాధీనం, స్విఫ్ట్ కారు సీజ్...

బొల్లారం, ఫిబ్రవరి 06(ప్రజాస్వరం):

బెల్ట్ షాపులో మద్యం అమ్మి అధిక లాభాలు పొందాలనే ఉద్దేశంతో అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తిని ఐడిఏ బొల్లారం పోలీసులు పట్టుకున్నారు. చాకలి మహేష్ వైన్స్ షాపుల నుంచి మద్యం తీసుకొని అధిక ధరకు విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నాడని నమ్మదగిన సమాచారం మేరకు పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు.

ఈ తనిఖీల్లో నిన్న గురువారం నాడు మహేష్ తన స్విఫ్ట్ కారులో అక్రమంగా మద్యం తరలిస్తుండగా పట్టుబడ్డాడు. కారులో మొత్తం 78 లీటర్ల బీరు (రూ.19,500 విలువ) మరియు 26.640 లీటర్ల విస్కీ (రూ.29,304 విలువ) కలిపి మొత్తం 104 లీటర్ల మద్యం (216 బాటిళ్లు), మొత్తం విలువ రూ.48,804 స్వాధీనం చేసుకున్నారు.

అక్రమంగా మద్యం తరలించిన స్విఫ్ట్ కారును పోలీసులు సీజ్ చేసి, నిందితుడిపై కేసు నమోదు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా మద్యం అమ్మినా, కలిగి ఉన్నా అట్టి వ్యక్తులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఐడిఏ బొల్లారం ఇన్స్పెక్టర్ మూల రవీందర్ రెడ్డి హెచ్చరించారు.

Latest News

వాణిజ్య శాస్త్ర అధ్యాపకురాలికి డాక్టరేట్... వాణిజ్య శాస్త్ర అధ్యాపకురాలికి డాక్టరేట్...
మెదక్, ఫిబ్రవరి 06 (ప్రజాస్వరం):   స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వాణిజ్య శాస్త్ర ఆధ్యాపకురాలిగా పనిచేస్తున్న పైడి హరిత డాక్టరేట్ పొందినట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కే...
13వ వార్డులో జానకిరామ్ గౌడ్ ఇంటింటా ప్రచారం.... 
తూప్రాన్ లో పోలీస్ ల ప్లాగ్ మార్చ్..... 
అక్రమ మద్యం రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్ట్...
షాపుల వద్ద సీసీ కెమెరాలు తప్పనిసరి....
104 లీటర్ల మద్యం స్వాధీనం, స్విఫ్ట్ కారు సీజ్...
14వ వార్డులో జనసేన అభ్యర్థి జంగం స్వాతి సుధాకర్ హోరాహోరీ ప్రచారం...