తూప్రాన్ లో పోలీస్ ల ప్లాగ్ మార్చ్..... 

తూప్రాన్ లో పోలీస్ ల ప్లాగ్ మార్చ్..... 

తూప్రాన్, ఫిబ్రవరి 6 (ప్రజాస్వరం) :

పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి 

 

తూప్రాన్ లో రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తూప్రాన్ పట్టణంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించబడింది. ఈ ఫ్లాగ్ మార్చ్‌లో తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్, తూప్రాన్ రామాయంపేట, నర్సాపూర్ సీఐలు, అలాగే తూప్రాన్ సర్కిల్‌కు చెందిన ఎస్‌ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు. ఫ్లాగ్ మార్చ్ సందర్భంగా తూప్రాన్ ప్రజలకు ఎలాంటి భయం లేదా ప్రలోభాలకు లోనుకాకుండా స్వేచ్ఛాయుతంగా, న్యాయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని అవగాహన కల్పించబడింది. పోలింగ్ రోజున శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు పోలీసులు 24 గంటలూ భద్రత కల్పిస్తారని భరోసా కల్పించడానికే ప్లాగ్ మార్చ్ నిర్వహించాం అని తూప్రాన్ డిఎస్పీ నరేందర్ గౌడ్ తెలిపారు

Latest News

వాణిజ్య శాస్త్ర అధ్యాపకురాలికి డాక్టరేట్... వాణిజ్య శాస్త్ర అధ్యాపకురాలికి డాక్టరేట్...
మెదక్, ఫిబ్రవరి 06 (ప్రజాస్వరం):   స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వాణిజ్య శాస్త్ర ఆధ్యాపకురాలిగా పనిచేస్తున్న పైడి హరిత డాక్టరేట్ పొందినట్లు కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కే...
13వ వార్డులో జానకిరామ్ గౌడ్ ఇంటింటా ప్రచారం.... 
తూప్రాన్ లో పోలీస్ ల ప్లాగ్ మార్చ్..... 
అక్రమ మద్యం రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్ట్...
షాపుల వద్ద సీసీ కెమెరాలు తప్పనిసరి....
104 లీటర్ల మద్యం స్వాధీనం, స్విఫ్ట్ కారు సీజ్...
14వ వార్డులో జనసేన అభ్యర్థి జంగం స్వాతి సుధాకర్ హోరాహోరీ ప్రచారం...