ఉపాధి కూలీల నోట్లో మట్టి కొడుతున్న మోడీసర్కార్

ఉపాధి కూలీల నోట్లో మట్టి కొడుతున్న మోడీసర్కార్

 కేంద్రం నిధులు తగ్గించి పని దినాలు పెంచడం ఎలా సాధ్యం

మహాత్మ గాంధీ పేరు తొలగింపు రాజకీయ రాక్షస క్రీడ

పాత పద్ధతిలోనే ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలి

 కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పసుల చంటి

ఆదిలాబాద్ జిల్లా జనవరి 23 (ప్రజాస్వరం):

 

కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చుతూ, పని దినాల పెంపు పేరు చెప్పి నిధులు తగ్గించి ఉపాధి కూలీల కడుపులో మట్టి కొడుతున్నదని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పసుల విమర్శించారు బోథ్ మండలంలోని ధన్నూర్ బి గ్రామపంచాయతీ పరిధిలోని కండిగుట్ట వద్ద ఉపాధి హామీ కూలీలతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాలపై భారం పెంచుతూ, ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గించి, సాంకేతికత పేరుతో నిధులు నిలుపుదల చేస్తూ పలు రకాలుగా కూలీలపై భారాన్ని పెంచుతున్నారని, నూతన చట్టంలో డిమాండ్ రహిత పని విధానాన్ని, అధికారులు గ్రామాలలో పనులు సూచించడాన్ని, ఉపాధి హామీ పథకం కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకం కింద మార్చడం అంటే పార్లమెంట్ కు సంబంధం లేకుండా ఇస్టారితిన మార్పులు చేర్పులు చేసే అవకాశం ఈ ప్రభుత్వం కల్పించిందని లోపలను సవరించాలని డిమాండ్ చేశారు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లో నుండి రాజకీయ దురుద్దేశం గానే మహాత్మా గాంధీ పేరును, ఉపాధి చట్టానికి తూట్లు పోలుస్తూ రాజకీయ రాక్షసక్రీడను బిజెపి ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయని విమర్శించారు రాజకీయ సైద్ధాంతిక అవగాహన భావజాలాల పేరిట పేద బడుగు బలహీన వర్గాల హక్కులను కాలరాయడం మంచిది కాదని, ఉపాధి హామీ చట్టాన్ని సవరించే వరకు, పాత పద్ధతిలో కొనసాగించేంతవరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భవిష్యత్తులో మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఉపాధి కూలీలతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు

Latest News

జిన్నారం బీఆర్ఎస్ నాయకుల సమావేశం... జిన్నారం బీఆర్ఎస్ నాయకుల సమావేశం...
జిన్నారం, ఫిబ్రవరి 04(ప్రజాస్వరం): జిన్నారం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వివిధ వార్డు సభ్యులతో విస్తృత స్థాయి ముఖ్య సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రతి వార్డుకు...
జామియా మస్జిద్ లో "షబ్ ఏ బరాత్"సందర్బంగా ప్రత్యేక కార్యక్రమాలు...
కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ పార్టీ నేతలు ...
గజ్వేల్ మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ దే....
పొలంలో విద్యుత్ షాక్‌తో యువ రైతు....
అక్రమ మట్టి దందా..
టోల్‌ప్లాజా వద్ధ 300 గ్రాముల అల్పోజం పట్టివేత..