జిన్నారం బీఆర్ఎస్ నాయకుల సమావేశం...
జిన్నారం, ఫిబ్రవరి 04(ప్రజాస్వరం):
జిన్నారం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వివిధ వార్డు సభ్యులతో విస్తృత స్థాయి ముఖ్య సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రతి వార్డుకు సంబంధించిన సమస్యలు, అభివృద్ధి అవసరాలు, ప్రజల ఆశలు ఆకాంక్షలపై సభ్యుల నుంచి వివరాలు సేకరించి సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సందర్భంగా పాల సాయి కుమార్, జిన్నారం ఇన్‌చార్జ్ ఐలాపూర్ మాణిక్ యాదవ్, శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ ఉద్యమ నాయకుడు వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ ఘన విజయం సాధించేలా ప్రతి కార్యకర్త అంకితభావంతో పని చేయాలని పిలుపునిచ్చారు.
ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తామని తెలిపారు. ప్రతి వార్డులో పార్టీ బలాన్ని పెంచుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశం పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపిందని నాయకులు పేర్కొన్నారు.


