గజ్వేల్ మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ దే....
ఎమ్మెల్సీ యాదవ రెడ్డి..
అభివృద్ధి చేసిన పార్టీ నాయకులను గెలిపించండి...
గజ్వేల్, 04 ఫిబ్రవరి (ప్రజాస్వరం):
సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కప్ప మమత పోచయ్య తరపున ఒకటో వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉమ్మడి మెదక్ జిల్లా ఎమ్మెల్సీ యాదవ రెడ్డి మాట్లాడుతూ, బిఆర్ఎస్ పాలనలోనే పట్టణాలు, పల్లెలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాయని పేర్కొన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి బిఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.ఈ సందర్భంగా అభ్యర్థి కప్ప మమత పోచయ్య మాట్లాడుతూ, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ నెల 11న జరిగే మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజలు తమ అమూల్యమైన ఓటును కారు గుర్తుపై వేసి ఆశీర్వదించాలని కోరారు.
ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి మల్లేశం,ప్రభాకర్, స్వామి, ప్రవీణ్, చందు, కుమార్ తదితర నాయకులు, ఒకటో వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


