ఎల్లంపేట్ చైర్ పర్సన్ పీఠం కాంగ్రెస్ దే....

మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి..

ఎల్లంపేట్ చైర్ పర్సన్ పీఠం కాంగ్రెస్ దే....

ఎమ్మెల్యే మల్లారెడ్డి పక్క కమర్షియల్ క్యాండేట్ 

మేడ్చల్, ఫిబ్రవరి 3 (ప్రజాస్వరం):                                             

18 వార్డులను గెలిచి ఎల్లంపేట్ మునిసిపల్ ఛైర్పర్సన్ పీఠాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే, ఎల్లంపేట్ మున్సిపల్ ఎన్నికల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మల్లిపెద్ది సుధీర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం మేడ్చల్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మలి పెద్ది సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. 24 వార్డులలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు బి ఫామ్ ఇచ్చి ఎన్నికల బరిలో ఉంచినట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రజలకు ఇస్తున్న పథకాలను క్షేత్రస్థాయిలో వారి వద్దకు తీసుకెళ్లి ఎన్నికల పోరులో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకుంటామని అన్నారు. ఎమ్మెల్యే మల్లారెడ్డి పక్క కమర్షియల్ క్యాండేట్ అని, ప్రజాసేవ చేసేందుకు ఆయన రాజకీయాల్లోకి రాలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో నాలుగు గ్యారెంటీలను ఇప్పటికే విస్తృత స్థాయిలో ఇస్తున్నామని, రానున్న రోజుల్లో మిగిలిన రెండు గ్యారెంటీలను కూడా అందజేస్తామని చెప్పారు. కార్యక్రమంలో మేడ్చల్ సర్కిల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేముల శ్రీనివాస్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉద్దండపురం సత్యనారాయణ, ఓబిసి చైర్మన్ గువ్వ రవి ముదిరాజ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ దుర్గం శంకర్ ముదిరాజ్, సీనియర్ నాయకులు రామన్న గారి సంతోష్ గౌడ్, మాజీ కౌన్సిలర్ కౌడె మహేష్ కురుమ, సురేందర్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Latest News

ఎన్నికలు సజావుగా నిర్వహించాలి.... ఎన్నికలు సజావుగా నిర్వహించాలి....
తూప్రాన్‌, ఫిబ్రవరి 3 (ప్రజాస్వరం): పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి తూప్రాన్. రామాయంపేట నర్సాపూర్ మున్సిపల్‌ ఎన్నికలను సజావుగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్‌...
నాలుగు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ జండా ఎగరడం ఖాయం..
ఎల్లంపేట్ చైర్ పర్సన్ పీఠం కాంగ్రెస్ దే....
బాలాజీ నగర్ లో టైగర్ కారింగుల నర్సింగరావు గౌడ్ 27వ వర్ధంతి ...
మున్సిపల్ పైన బీజేపీ జెండా ఎగరెయ్యాలి...
పటాన్‌చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థులకు బి-ఫామ్‌ల పంపిణీ
దౌల్తాబాద్ పాఠశాలల్లో డీఈఓ ఆకస్మిక తనిఖీలు...