పటాన్‌చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థులకు బి-ఫామ్‌ల పంపిణీ
పటాన్‌చెరు, ఫిబ్రవరి 03(ప్రజాస్వరం):
పటాన్‌చెరు నియోజకవర్గంలోని ఐదు మున్సిపాలిటీలకు చెందిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు బి-ఫామ్‌లను పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కాట శ్రీనివాస్ గౌడ్ మరియు మెదక్ పార్లమెంట్ ఇన్‌చార్జి నీలం మధు అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లి, పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్తపై ఉందని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి ప్రణాళికలను ప్రజలకు వివరించి, ఎన్నికల్లో పార్టీ విజయానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


