తప్పుడు కేసులు – కక్ష రాజకీయాలు
బీఆర్ఎస్ పోరాటం ఆగదు:ఐలపూర్ మాణిక్ యాదవ్
పటాన్ చెరు, జనవరి 20(ప్రజా స్వరం):
ప్రజా సమస్యలపై ప్రశ్నించినందుకే బీఆర్ఎస్ నాయకులపై కేసులు పెట్టడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటుగా మారింది.
రుణమాఫీ, సర్పంచుల బిల్లులు, వరద బాధితులు, ఆరు గ్యారెంటీలు, కాళేశ్వరం ప్రాజెక్టు వంటి అంశాలపై నిలదీసిన ప్రతిసారీ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది.
ప్రతిపక్షంగా బీఆర్ఎస్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతోంది.
బొగ్గు స్కాం సహా అనేక స్కాంలను బీఆర్ఎస్ బయటపెట్టడంతో భయపడి, సిట్ పేరుతో హరీశ్ రావుపై తప్పుడు కేసులు మోపడం ప్రజాస్వామ్యంపై దాడిగా నిరసన వ్యక్తమైంది.
ఎన్ని కేసులు పెట్టినా హరీశ్ రావు పోరాట పటిమను దెబ్బతీయలేరు.
ప్రజల పక్షాన తప్పులను ఎండగట్టే బీఆర్ఎస్ సంకల్పం చెక్కుచెదరదు అని ఐలపూర్ మాణిక్ యాదవ్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో
బీఆర్ఎస్ నాయకులు పటాన్‌చెరు కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి, పటాన్‌చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, బాల్ రెడ్డి, సోమిరెడ్డి, శ్రీకాంత్ గౌడ్, రాజ్ కుమార్ యాదవ్ మరియు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


