ఢిల్లీ గణతంత్ర దినోత్సవ వేడుకలకు గుమ్మడిదల మహిళకు ఆహ్వానం

ఢిల్లీ గణతంత్ర దినోత్సవ వేడుకలకు గుమ్మడిదల మహిళకు ఆహ్వానం

గుమ్మడిదల, జనవరి 20(ప్రజా స్వరం):

 

దేశ రాజధాని ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించడం చాలా మందికి కలలాంటిది. అయితే గుమ్మడిదలకు చెందిన మహిళా పారిశ్రామికవేత్త చెన్నంశెట్టి మౌనిక ఉదయ్ కుమార్‌కు ఆ అరుదైన అవకాశం లభించింది.

సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ పరిధిలోని కాయిర్ బోర్డు–మహిళా కాయిర్ యోజన కింద ఉత్తమ మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ, న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో జరగనున్న 2026 గణతంత్ర దినోత్సవ వేడుకలకు ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించే కార్యక్రమం చేపట్టింది.

ఈ సందర్భంగా మౌనిక ఉదయ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతం నుంచి మొత్తం ఐదుగురు మహిళా పారిశ్రామికవేత్తలు ఎంపిక కాగా, వారిలో తాము కూడా ఉండటం ఎంతో గర్వకారణమని తెలిపారు. ఇలాంటి అవకాశం రావడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.