పదవతరగతి మూల్యాంకన కేంద్రం ఏర్పాటు కు కృషిచేసిన మెదక్ ఎంపీకి ధన్యవాదలు : తపస్
చేగుంట, జనవరి 22 ( ప్రజాస్వరం ):
ఎంపీ రఘునందన్ రావు గారి చొరవతో మెదక్ జిల్లా కేంద్రంలో పదవ తరగతి మూల్యాంకన కేంద్రం మంజూరు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ మెదక్ జిల్లా ఆధ్వర్యంలో మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు గారిని కలిసి, మెదక్ జిల్లా కేంద్రంలో పదవ తరగతి మూల్యాంకన కేంద్రం ఏర్పాటుకు వినతి పత్రం సమర్పించడం జరిగింది. వెంటనే ఎంపీ ప్రత్యేక చొరవ తీసుకొని ఎడ్యుకేషన్ సెక్రెటరీ నవీన్ నికోలస్ గారికి ఫోన్ ద్వారా సంప్రదించారు. స్పందించిన నవీన్ నికొలస్ మెదక్ జిల్లా కేంద్రంలో పదవ తరగతి మూల్యాంకన కేంద్రాన్ని మంజూరు చేయిస్తున్నట్లు ఎంపీ గారికి సమాచారం ఇచ్చారు. ఇట్టి విషయాన్ని పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు ధ్రువీకరించారు. మెదక్ జిల్లా చిరకాల కోరిక అయినటువంటి పదవ తరగతి మూల్యాంకన కేంద్రం మెదక్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయడం పట్ల తపస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తపస్ మెదక్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జిడ్డి ఎల్లం, జలా సిద్దు, తపస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చల్లా లక్ష్మణ్, మన్నే వెంకట్ స్వామి,జిల్లా నాయకులు తిరునగిరి నర్సిములు, మార్గం రాజు,బిక్షపతి, మల్లేశం, మధుమోహన్ తదితరులు పాల్గొన్నారు.


