నాలుగు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ జండా ఎగరడం ఖాయం..

జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి..

నాలుగు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ జండా ఎగరడం ఖాయం..

  రామాయంపేట, ఫిబ్రవరి 03 ( ప్రజాస్వరం ):

రామయంపేట మెదక్ జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలలో టిఆర్ఎస్ జండా ఎగరడం ఖాయమని గత పది సంవత్సరాల పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తుందని మాజీ డిప్యూటీ స్పీకర్ మెదక్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. రామయంపేట మున్సిపాలిటీ లోని 12 వార్డులకు బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా విడుదల చేస్తూ వారికి బీ ఫాం లను అందజేశారు, ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ కొనసాగుతున్నాయని, సర్పంచ్ ఎన్నికలలో వచ్చిన మెజార్టీ మున్సిపల్ ఎన్నికల్లో కూడా టిఆర్ఎస్ పార్టీకి వస్తుందని తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతామని భయంతోనే కేసీఆర్ పై ఇబ్బంది పెట్టే విధంగా, కష్టపూర్తంగా చర్యలతోనే సిట్ నోటీసులు ఇవ్వడం జరిగిందని కాలేశ్వరం ప్రాజెక్టు కమిషన్ అని ఒకసారి, ఫోన్ టాపింగ్ అని ఒకసారి, రకరకాల కుట్రలతో కేసీఆర్ పైన అబాండo వేసి, కుట్రలు చేయడం జరిగిందని దీంతో ప్రజలలో బిఆర్ఎస్ పార్టీపై కేసీఆర్ పై మరింత అభిమానం పెరిగిందని, మున్సిపల్ ఎన్నికలలో టిఆర్ఎస్ అభ్యర్థులను కూడా కొట్టాలని ఉద్దేశంతో చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్లాన్ తలకిందులుగా మారిందని ఆమె తెలిపారు, మెదక్ జిల్లాలో తూప్రాన్ నర్సాపూర్ రామయంపేట మెదక్ మున్సిపాలిటీలలో కచ్చితంగా టిఆర్ఎస్ జండా ఎగరవేయడం జరుగుతుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు, 10 సంవత్సరాల పాలనలో కేసీఆర్ ఫలాలు ప్రజలందరికీ అందించడం జరిగిందని రైతుల బాగు కోసం రైతుబంధు రైతు బీమా వంటి పథకాలతో రైతులను ఆదుకోవడం జరిగిందని ప్రస్తుత ప్రభుత్వం కనీసం రైతులకు రైతు బంధు కూడా వేయలేక పోయిందని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి రవీందర్ రెడ్డి,మాజీ మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, పుట్టి యాదగిరి,చౌదరి సుప్రభాత రావ్,గోపరి నర్సింలు, కన్నాపురం కృష్ణ గౌడ్, మర్కు దత్తు, ఐలయ్య, సుభాష్ రాథోడ్, ఉమామహేశ్వర్, గోండస్వామి యాదవ్, మద్దెల రమేష్, రామ్ కి, నరసింహారావు, అబ్దుల్, తో పాటు కౌన్సిలర్ అభ్యర్థులు పాల్గొన్నారు

Latest News

ఎన్నికలు సజావుగా నిర్వహించాలి.... ఎన్నికలు సజావుగా నిర్వహించాలి....
తూప్రాన్‌, ఫిబ్రవరి 3 (ప్రజాస్వరం): పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి తూప్రాన్. రామాయంపేట నర్సాపూర్ మున్సిపల్‌ ఎన్నికలను సజావుగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్‌...
నాలుగు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ జండా ఎగరడం ఖాయం..
ఎల్లంపేట్ చైర్ పర్సన్ పీఠం కాంగ్రెస్ దే....
బాలాజీ నగర్ లో టైగర్ కారింగుల నర్సింగరావు గౌడ్ 27వ వర్ధంతి ...
మున్సిపల్ పైన బీజేపీ జెండా ఎగరెయ్యాలి...
పటాన్‌చెరు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థులకు బి-ఫామ్‌ల పంపిణీ
దౌల్తాబాద్ పాఠశాలల్లో డీఈఓ ఆకస్మిక తనిఖీలు...