జిల్లా లో వేసవిలో తాగునీటి ఎద్దడి ఉండకూడదు....
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలి...
మెదక్ జనవరి 20 (ప్రజాస్వరం):
రాబోయే వేసవిలో జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. సోమవారం మెదక్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో పంచాయతీరాజ్, మిషన్ భగీరథ, గ్రామీణ నీటి సరఫరా శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు జిల్లావ్యాప్తంగా పంప్ సెట్లు, పని చేస్తున్న బోర్‌వెల్‌ల పూర్తి వివరాలు సేకరించాలని సూచించారు. మైనర్ రిపేర్ల కోసం చెక్ లిస్ట్ తయారు చేసి గుర్తించిన సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలని ఆదేశించారు. గ్రామాలలో అందుబాటులో ఉన్న అగ్రికల్చర్ బోర్లు, ఇతర నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించి వేసవిలో తాగునీటి కొరత తలెత్తకుండా ముందస్తు ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు. సంబంధిత శాఖలు సంయుక్తంగా జాయింట్ ఇన్‌స్పెక్షన్లు నిర్వహించి సమస్యలు ఉత్పన్నం కాకముందే పరిష్కరించాలని స్పష్టం చేశారు. లెస్ ప్లాస్టిక్, లెస్ పేపర్, లెస్ పవర్ ను సమర్థవంతంగా అమలు చేయాలనీ, ప్లాస్టిక్ వినియోగం లేకుండా చూడాలని, కార్యాలయాల ఫైల్స్ అన్ని ఈ ఆఫీస్ లో ఉండాలని, ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్ వినియోగం తగ్గించాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, డి ఆర్ ఓ భుజంగ రావు, మెదక్ ఆర్ డి ఓ రమాదేవి, జిల్లా అధికారులు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు, మిషన్ భగీరథ అధికారులు, మండల పరిషత్ అధికారులు, హౌసింగ్ ఏఈలు, తదితరులు పాల్గొన్నారు.


