కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ మాజీ కౌన్సిలర్ మామిడి వెంకటేష్
తూప్రాన్ జనవరి 20 (ప్రజాస్వరం) :
పూర్ణ రాజు గౌడ్ ప్రతినిధి
తూప్రాన్ మున్సిపాలిటీ లోని రెండవ వార్డ్ మాజీ కౌన్సిలర్ మామిడి వెంకటేష్ బిఆర్ఎస్ పార్టీ నుండి గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తూముకుంటనర్సారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.. ఆయనతోపాటు రెండో వార్డుకు సంబంధించిన 200 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు తూప్రా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించి చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంటుందని తూముకుంట నర్సారెడ్డి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నాచారం దేవాలయ చైర్మన్ పల్లెర్ల రవీందర్ గుప్తా, మాజీ మున్సిపల్ చైర్మన్ మామిండ్ల జ్యోతి కృష్ణ వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్ చిన్న నాగరాజుగౌడ్, మండల పార్టీ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి విశ్వరాజ్ కోడిప్యాక నారాయణ గుప్తా, దీపక్ రెడ్డి, దుర్గం నగేష్ విట్టల్ రెడ్డి పురం రవి తదితరులు పాల్గొన్నారు


