అనుమతులు లేని పెంట్ హౌస్ కూల్చివేత

అనుమతులు లేని పెంట్ హౌస్ కూల్చివేత

అమీన్ పూర్, జనవరి 20(ప్రజాస్వరం):

 కోర్టు ఉత్తర్వుల మేరకు పటాన్ చెరు నియోజకవర్గం పటేల్‌గూడలోని సృజన లక్ష్మీ నగర్‌లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన పెంట్ హౌస్‌ను మంగళవారం నాడు అధికారులు కూల్చివేశారు. జిహెచ్ఎంసి ఏసీపీ పవన్, టీపీబీఓ రోహన్ సింగ్‌ ఆధ్వర్యంలో రెవెన్యూ మరియు పోలీసు శాఖల సమన్వయంతో ఈ తొలగింపు ప్రక్రియను చేపట్టారు. అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు.