ప్రయాణికుల భద్రతే ఆర్టీసీ లక్ష్యం 

 ఆర్టీసీ రీజినల్ మేనేజర్ శ్రీలత

ప్రయాణికుల భద్రతే ఆర్టీసీ లక్ష్యం 

తాండూరు, జనవరి 21 (ప్రజాస్వరం):

ప్రయాణికుల భద్రత, సురక్షిత ప్రయాణానికి ఆర్టిసి అధికారులు సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారని ఆర్టీసీ రీజినల్ మేనేజర్ శ్రీలత పేర్కొన్నారు. భద్రత మాస ఉత్సవాల సందర్భంగా తాండూరు డిపోలో సమావేశం నిర్వహించారు. ప్రతిరోజు లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేసి సమయానుకూలంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుస్తున్నట్లు తెలిపారు. డ్రైవర్లకు కండక్టర్లకు రక్షణ సంబంధించి ప్రతిరోజు ఉదయం అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. డిపోల్లో విధులకు వెళ్లే ముందు డ్రైవర్లకు డ్రంక్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. తాండూరు డిఎస్పి యాదయ్య మాట్లాడుతూ... వాహనం నడిపే ముందు అందరూ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు జరగవని అన్నారు. మద్యం సేవించి వాహనం నడపడం, రోడ్లపై ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలుపుదల చేయడంతో ఇతర ప్రయాణికులకు ఇబ్బందులతో పాటు ప్రమాదాల ఆస్కారం ఉంటుందన్నారు. సమావేశంలో పరిగి , తాండూరు, వికారాబాద్ డిపోలకు చెందిన ప్రమాద రహిత, ఉత్తమ బస్సు డ్రైవర్లకు శాలువా, నగదు తో సన్మానించారు. ఈ

కార్యక్రమంలో డిప్యూటీ ఆర్ ఎం సరస్వతి, ఏ ఎం వి ఐ అరుణ్ కుమార్ , తాండూరు డిఎస్పి యాదయ్య, డిపో మేనేజర్లు సురేష్ కుమార్, కృష్ణమూర్తి, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.