మున్సిపాలిటీలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ చెప్పట్టాలి
రామాయంపేట. జనవరి. 20.( ప్రజాస్వరం ):
మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ చేపట్టి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగి రాములు డిమాండ్ చేశారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయం వద్ద బిజెపి పట్టణ అధ్యక్షులు శీలం అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ గేటు ముందు బైఠాయించిన బిజెపి నాయకులు అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. సంవత్సర కాలంలో 15వ ఫైనాన్స్ నుంచి విడుదలైన నిధులలో సుమారులకు 90 లక్షల రూపాయల మేర అవినీతి జరిగిందని వారు ఆరోపించారు. అవినీతి అక్రమాలపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి కమిషనర్ దేవేందర్, తో పాటు అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం ర్యాలీగా వెళ్లిన బిజెపి నాయకులు తహసీల్దార్ కు సమస్యలతో కూడిన వినతిపత్రం సమర్పించారు. రెండు రోజుల్లో మున్సిపల్ కమిషనర్ పై చర్య తీసుకోకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రామాయంపేట పట్టణ అధ్యక్షులు శీలం అవినాష్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ మెంబెర్ రాగి రాములు , ఓబీసీ మోర్చా రాష్ట్ర కౌన్సిల్ మెంబెర్ చితల శేఖర్, పట్టణ ప్రధాన కార్యదర్శులు మన్నె ప్రవీణ్ రాజు, అక్కల అనిల్, పట్టణ ఉపాధ్యక్షులు నాగరాజు,భరత్, వెంకట్, స్వామి,యువ మోర్చా నాయకులు కన్నయ్య, మహిళా మోర్చా సభ్యులు లావణ్య గారు,మాజీ అధ్యక్షులు దయానంద్ గారు, బాను చందర్ గారు, సీనియర్ నాయకులు దామోదర్ గారు, ముత్తయ్య గారు, ముఖ్యనాయకులునవాత్ రాజు, కటికే కార్తీక్, బాసం అనిల్, గిరి, సందీప్ తదితరులు పాల్గొన్నారు


