పోటీ ఉన్న స్థానాలపై సర్వేలు నిర్వహిస్తున్నాం...

నర్సారెడ్డి గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే 

పోటీ ఉన్న స్థానాలపై సర్వేలు నిర్వహిస్తున్నాం...

తూప్రాన్ జనవరి 21( ప్రజాస్వరం):

 పూర్ణ రాజ్ గౌడ్ ప్రతినిధి 

 

తూప్రాన్ మున్సిపాలిటీలోని 16 వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థులు ఒక్కచోట ఇద్దరు. ముగ్గురు ఉన్నారని అందరిని సమన్వయం చేసిఅభ్యర్థుల ప్రకటన ఉంటుంది అని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తుంకుంట నర్సారెడ్డి అన్నారు 2.3.4.7.10.12.15.16 వార్డుల లో అభ్యర్థులు పోటీ చేయడానికి పోటీ పడుతున్నారని వారి పేర్లను పరిశీలనాలోకి తీసుకొని సర్వే చేస్తున్నట్లు ఎవరు గెలిచే అవకాశం ఉంటే వారికీ బి ఫామ్ ఉంటుందని నిరాశ పడకుండా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గలిపించాలని కాంగ్రెస్ గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తుంకుంట నర్సారెడ్డి పేర్కొన్నారు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నేనే పోటీ చేస్తున్నా నేనే గెలుస్తా అనే నమ్మకం తో పని చేసి 16 వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలియించాలని ఆయన కోరారు..ఈ కార్యక్రమం మోతుకు మానస దుర్గాప్రసాద్ నవీన్ గౌడ్ ప్రశాంత్ 12 వార్డు యువకులు కార్యకర్తలు పాల్గొన్నారు