బీఆర్ఎస్‌కు గట్టి షాక్
ఇస్నాపూర్‌లో 50 మంది కాంగ్రెస్ బాట
By Prajaswaram
On
కాట శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో చేరికలు
పటాన్‌చెరు, జనవరి 20( ప్రజా స్వరం):
పటాన్ చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో బీఆర్ఎస్‌కు షాక్ ఇచ్చేలా మాజీ వార్డ్ సభ్యులు నారాయణ దాసు, సంపత్ రెడ్డి, నేతలు మన్నె రాఘవేందర్, కంజర్ల సాయి, వెంకటేష్ నాయక్‌తో పాటు అనుచరులు పార్టీకి గుడ్‌బై చెప్పారు.
సుమారు 50 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ పార్టీ పటాన్‌చెరు నియోజకవర్గ ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్ చేరికల సందర్భంగా కండువాలు కప్పి ఆహ్వానం పలికారు.
ఇస్నాపూర్ రాజకీయాల్లో ఈ చేరిక పై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేసారు.ఈ చేరికలు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తోడ్పడుతుంది అని కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
Latest News
04 Feb 2026 06:56:36
తూప్రాన్, ఫిబ్రవరి 3 (ప్రజాస్వరం): పూర్ణరాజు గౌడ్ ప్రతినిధి తూప్రాన్ మున్సిపాలిటీ పరిధి లోని టోల్ ప్లాజా వద్ద మంగళవారం రోజు వాహనాలు తనిఖీ చేస్తున్న పోలిసులకు...


