మల్కాపూర్ సందర్శించిన శ్రీలంక మేయర్ల బృందం 

మల్కాపూర్ సందర్శించిన శ్రీలంక మేయర్ల బృందం 

తూప్రాన్ జనవరి 20 (ప్రజాస్వరం ):

పూర్ణ రాజు గౌడ్ ప్రతినిధి 

 

తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామాన్ని మంగళవారం శ్రీలంక దేశానికి చెందిన మేయర్ల బృందం ఎన్ ఐ ఆర్ డి ఆధ్వర్యంలో సందర్శించారు. గ్రామంలో జరిగిన పలు అభివృద్ధి పనుల తీరుతనులను గ్రామ సర్పంచ్ పంజాల ఆంజనేయులు గౌడ్ వారికి వివరించడం జరిగింది. అంతకుముందు కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన అధికారుల బృందం గ్రామాన్ని సందర్శించారు. మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు, రాక్ గార్డెన్, డంపింగ్ యార్డ్ లను పరిశీలించారు. అంగన్వాడీల పనితీరు, జిల్లా పరిషత్ హై స్కూల్, ప్రాథమిక పాఠశాల పనితీరుపై ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. మల్కాపూర్ అంచలంచెలుగా అభివృద్ధి చెంది మోడల్ విలేజ్ గా మారిన తీరుతనులపై శ్రీలంక ప్రజా ప్రతినిధుల బృందం సంతృప్తి వ్యక్తం చేశారు. 

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పంజాల ఆంజనేయులు గౌడ్, ఎన్ ఐ ఆర్ డి ప్రతినిధి ఆశాలత, ఎంపీడీవో సతీష్, ఎంపీ ఓ సంతోష్ రెడ్డి, ఉప సర్పంచ్ పల్లెపాటి స్వామి, టీజీఎస్ టెక్నికల్ అసిస్టెంట్ సురేష్, సత్యం, పంచాయతీ కార్యదర్శి నాగరాజు, ఫీల్డ్ అసిస్టెంట్ కనకరాజు,మేకిన్ యువత, అంగన్వాడి టీచర్లు, స్వర్ణలత, లావణ్య, ఆశా వర్కర్ ఇందిరా, వివో ఏ సంతోష, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.